అనుకూలంగా మూడు శుభ గ్రహాలు.. నెలాఖరుకల్లా ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు.. !

ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా కొందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు, ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది. సహజ శుభ గ్రహాలైన గురు, బుధ, శుక్రుల సంచారం శుభ స్థానాల్లోనే జరుగుతున్నందువల్ల ఈ నెలాఖరులోగా ఆరు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది.

అనుకూలంగా మూడు శుభ గ్రహాలు.. నెలాఖరుకల్లా ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు.. !
Astrology 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 17, 2024 | 12:57 PM

ప్రస్తుత గ్రహ సంచారం రీత్యా కొందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు, ఊహించని మలుపులు తిరిగే అవకాశం ఉంది. సహజ శుభ గ్రహాలైన గురు, బుధ, శుక్రుల సంచారం శుభ స్థానాల్లోనే జరుగుతున్నందువల్ల ఈ నెలాఖరులోగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది.

  1. వృషభం: ఈ రాశిలో గురువు ఉండడంతో పాటు కుటుంబ స్థానంలో శుక్ర. బుధ గ్రహాల సంచారం వల్ల కుటుంబ జీవితం అభివృద్ధి బాట పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి ముఖ్యమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. ధన ధాన్యా లకు లోటుండదు. అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడడం జరుగుతుంది. బంధుమిత్రుల్లో ప్రాధాన్యం, పలుకుబడి పెరుగుతాయి.
  2. మిథునం: ఈ రాశిలో బుధ, శుక్రులు ఉండడం వల్ల అనేక వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై, మనశ్శాంతి ఏర్పడుతుంది. వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల శుభ కార్యాలు, విహార యాత్రల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రతి పనీ సవ్యంగా, సానుకూలంగా జరిగిపోతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వింటారు.
  3. సింహం: ఈ రాశికి లాభస్థానంలో శుక్ర, బుధులు, ఉద్యోగ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ పరిస్థితి గణనీయంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడి, కుటుంబపరంగా ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందు తాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  4. కన్య: ఈ రాశివారికి దశమ స్థానంలో బుధ, శుక్రులు, భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబం బాగా మెరుగైన స్థితికి చేరుకుంటుంది. కుటుంబంలో చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సమాగమం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆర్థిక స్థితి బాగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ కార్యం చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదం పరిష్కారం అయి, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.
  6. ధనుస్సు: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల, రాశ్యధిపతి గురువు సహజ ధన స్థానంలో ఉన్నందువల్ల భాగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అనేక శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబ పరిస్థితులు అనేక విధాలుగా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయి, సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. దాంపత్య జీవితంలో బాగా అన్యోన్యత పెరుగుతుంది. విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది.