Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 17, 2024): మేష రాశి వారు పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపిస్తుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జూన్ 17, 2024): మేష రాశి వారు పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపిస్తుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఆనందంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే సూచనలున్నాయి. వాహన యోగం పట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగు తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫ లితాలనిస్తాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొం టారు. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగు తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రయాణాల వల్ల మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరు గుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సమయం అనుకూలంగా ఉంది. రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి దానంతటదే పరిష్కారం అవుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపు తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహా రాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపో తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు విజ యాలు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిపాటి వేధింపులు ఉండవచ్చు. పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించినతం ఉపయోగం ఉండకపోవచ్చు. తలపెట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగిపో తాయి. ప్రయాణాల్లో ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు పురో గతి సాధిస్తాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆర్థిక లావాదేవీలకు మాత్రం వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవ కాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సా హకాలు లభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలి స్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. బాధ్యతలు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదా నంగా పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. బంధువుల వల్ల ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తి వివాదంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.