హైదరాబాద్ బేగంపేటలో ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. నిషేధిత మాంజాలో చిక్కుకున్న గద్దను అదనపు డీసీపీ లక్ష్మి, ఏసీపీ శంకర్ రాజు సిబ్బంది సహాయంతో సురక్షితంగా రక్షించారు. పక్షులు, ప్రాణాలకు హాని కలిగించే మాంజా వాడకూడదని, పర్యావరణ పరిరక్షణలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరారు.