ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ డేట్ ఉంటుందా.. గడవు ముగిసింది వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Samatha

7 February 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉప్పు ఉండటం సహజం. ఏ వంటలో అయినా సరే ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉప్పుతోనే ఏ వంటకాలకైనా మంచి రుచి వస్తుంది.

ఉప్పు

అయితే చాలా మంది ఒకసారి ఉప్పు ప్యాకెట్ కొనుగోలు చేశారంటే దానిని ఎక్కువ రోజుల వాడుతుంటారు. మరి దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారంటే?

ప్యాకెట్ సాల్ట్

స్వచ్ఛమైన ఉప్పు అంటే సోడియం క్లోరైడ్, ఇది అంత త్వరగా చెడిపోదు. అంతే కాకుండా, తేమను, ఆకర్షిస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

స్వచ్చమైన ఉప్పు

అయితే మనం రోజూ ఉపయోగించే సాల్ట్ కేవలం ఉప్పు  మాత్రమే కాకుండా, దీనిలో అయోడిన్ కూడా ఉంటుంది. శరీరానికి అయోడిన్ అందించడానికి దీనిని ఉపయోగిస్తారు.

అయోడిన్

అయితే ఈ సాల్ట్‌కు గాలి, వెలుతురు తగలడం , ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వలన ఇందులోని అయోడిన్ కంటెంట్ అనేది తగ్గుతుంది

గాలి, వెలుతురు

అందుకోసమే ఈ ఉప్పు తయారు చేసే క్రమంలో వారు గడవు తేదీని సూచిస్తారు. గడువు తేదీ ముగిసి పోయింది అంటే, ఇందులోని పోషక విలువలు తగ్గినట్లు.

పోషక విలువలు

అయితే కొంత మంది ఉప్పు గడువు తేదీ ముగిసిపోయింది అంటే అది వాడటానికి వీలు లేనిది అనుకొని, బయటపారేస్తుంటారు. కానీ దానిని పారవేయాల్సిన అవసరం లేదంట.

ఎక్సపైరీ డేట్

కేవలం అందులోని పోషకాలు మాత్రమే తగ్గిపోతాయి, ఆ ఉప్పును ఆహారంలో ఉపయోగించ వచ్చు. కానీ కొన్ని సార్లు దాని వాసనలో మార్పులు వస్తే మాత్రం ఉపయోగించకూడదంట.

వాసనలో మార్పు

అందుకోసమే ఉప్పును ఎప్పుడూ వాడే వారు దానిలోని అయోడిన్ కంటెంట్ తగ్గకుండా ఉండటానికి, గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి వాడటం ఉత్తమం.

గాలిచొరబడని కంటైనర్