- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips for Shami Plant: Benefits Right Direction For Shami Plant In Home know the details
Shami Vastu Tips: జాతకంలో శని దోషమా నివారణ కోసం జమ్మి ఆకులతో ఇలా పూజ చేసి చూడండి..
జమ్మి మొక్కకు వాస్తు శాస్త్రంతో పాటు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో అనేక మొక్క గురించి వాటి ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. వీటిలో ఒకటి జమ్మి మొక్క. జమ్మి వృక్షాన్ని నియమ నిష్టలతో పూజిస్తే దైవ అనుగ్రహం లభిస్తుందని పూజకు తగిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఇంట్లో జమ్మి మొక్కను నాటడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది.
Updated on: Jun 17, 2024 | 2:26 PM

జమ్మి మొక్కకు సంబంధించిన మతపరమైన ప్రాముఖ్యతను పరిశీలిస్తే.. ఈ మొక్క శివునికి ప్రియమైనది. అలాగే శనిశ్వరుడు జమ్మి మొక్కలో నివసిస్తుందని భావిస్తారు. అయితే శమీ మొక్కను ఇంట్లో పెంచుకోవాలంటే జమ్మి మొక్కను నాటడానికి సరైన దిశను తెలుసుకుందాం.. ఈ రోజు జమ్మి మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

జమ్మి మొక్క ప్రాముఖ్యత: హిందూ మతపరమైన దృక్కోణంలో జమ్మి మొక్క శనీశ్వరుడికి సంబంధించిన మొక్కగా వర్ణించబడింది. ఇంట్లో దీనిని నాటడం ద్వారా.. శనిశ్వరుడి ఆశీర్వాదం పొందుతారని నమ్ముతారు. ఎవరైనా ఏలి నాటి శని ప్రభావంలో ఇబ్బంది పడుతుంటే అప్పుడు జమ్మి మొక్కను క్రమం తప్పకుండా పూజించాలి. అలాంటి వారు జమ్మి ఆకులతో వినాయకుడికి పూజ చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది.

జమ్మి మొక్కకు మరో పేరు: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జమ్మి మొక్కను శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పూజలో శమీ మొక్కను ఉపయోగిస్తారు. జీవితంలో కష్టాలు, బాధల నుండి ఉపశమనం కలిగించడానికి జమ్మి మొక్క పనిచేస్తుంది. జమ్మి ఆకులను శివునికి సమర్పించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు దీని ఆకులను గణేశుడు, శని దేవుడికి కూడా సమర్పించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

జమ్మి మొక్కను ఏ దిశలో నాటంటే: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద శమీ మొక్కను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఈ జమ్మి మొక్కను ఈశాన్య మూలలో కూడా నాటవచ్చు. శమీ చెట్టును ఈ దిశలో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Shami Plant





























