AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు..! ఇలా ఈజీగా పొందండి!

తిరుమల, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాల దర్శన, సేవా టికెట్లను సులభంగా పొందేందుకు ప్రభుత్వం కొత్త వాట్సప్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్యూల అవసరం లేకుండా 9552300009 నంబర్‌కు 'Hi' పంపడం ద్వారా మీ మొబైల్ నుంచే నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు..! ఇలా ఈజీగా పొందండి!
Tirumala Darshan Tickets
SN Pasha
|

Updated on: Feb 07, 2026 | 9:02 PM

Share

కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తుంటారు. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి గంటల కొద్దీ క్యూ లైన్లలో నిల్చుంటారు. శ్రీవారి దర్శన టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. అయితే తాజాగా మార్పులతో తిరుమల దర్శనం టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి ఉన్న చోట నుంచే నిమిషాల్లో టికెట్లు పొందొచ్చు. తిరుమలతో పాటుగా పలు ప్రముఖ ఆలయాల దర్శన, సేవా టికెట్ల కోసం ప్రభుత్వం ఈ నూతన విధానం భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బుకింగ్ విధానం

భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. టిక్కెట్లు ఈజీగా పొందడానికి 95523 00009 అనే వాట్సాప్ నెంబర్​ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శన, పలు సేవ టిక్కెట్లు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్​లో 95523 00009 అనే నంబర్ సేవ్ చేసుకొని Hi అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే దేవాలయ బుకింగ్ సేవలు అనే ఆప్షన్ కనిపిస్తుంది.

తిరుమల, శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ, శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ దేవాలయాల పేర్లు కనిపిస్తాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!