Telangana: తప్పతాగి కూతురిని వేధిస్తున్నాడనీ.. అల్లుడిని హత్య చేసిన మామ! ఎక్కడంటే..

అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని వయసొచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టాడు ఆ తండ్రి. కానీ కొన్నాళ్లకే అల్లుడు కూతురిని వేధించసాగాడు. కళ్లముందే కూతురు పడుతున్న కష్టాన్ని చూడలేక ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అంతే.. కూతురిని వేధిస్తున్నాడన్న వేదనతో అల్లుడిని హతమార్చి కసి తీర్చుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి..

Telangana: తప్పతాగి కూతురిని వేధిస్తున్నాడనీ.. అల్లుడిని హత్య చేసిన మామ! ఎక్కడంటే..
Man Stoned Son In Law To Death
Follow us

|

Updated on: Jun 17, 2024 | 11:20 AM

ఉండవెల్లి, జూన్‌ 17: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని వయసొచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టాడు ఆ తండ్రి. కానీ కొన్నాళ్లకే అల్లుడు కూతురిని వేధించసాగాడు. కళ్లముందే కూతురు పడుతున్న కష్టాన్ని చూడలేక ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అంతే.. కూతురిని వేధిస్తున్నాడన్న వేదనతో అల్లుడిని హతమార్చి కసి తీర్చుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి మద్దిలేటి, రాములమ్మ దంపతుల కూమార్తె మహేశ్వరి. తమ కుమార్తెను ఆరేళ్ల కిందట ఏపీలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన దేవేందర్‌ (36)కి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు సంతానం. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగినా.. మద్యానికి బానిసైన దేవేందర్‌ భార్యను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న మహేశ్వరి తండ్రి మద్దిలేటి.. తన కూతురిని పదిరోజుల కిందట ఉండవెల్లికి తీసుకొచ్చాడు.

అయితే తీరు మార్చుకోని దేవేందర్‌ తప్పతాగి శనివారం రాత్రి 10:30 గంటలకు ఉండవెల్లిలోని మామ ఇంటికి వచ్చి.. మరోసారి గొడవపడ్డాడు. అనంతరం అక్కడే నిద్రపోయాడు. అల్లుడి అరాచకాలు సహించలేకపోయిన మద్దిలేటి.. అదేరోజు అర్ధరాత్రి తన ఇంటి ముందున్న బండరాళ్లు, సిమెంట్‌ ఇటుకలతో దేవేందర్‌ తలపై మోది హత మార్చాడు. కూతురిపై ప్రేమతో అల్లుడిని హతమార్చిన మద్దిలేటి.. అక్కడి నుంచి పరారయ్యారు. మరో గదిలో ఇద్దరు పిల్లలతో నిద్రిస్తున్న మహేశ్వరి తెల్లవారుజామున లేచి చూడగా తన భర్త రక్తపు మడుగులో చలనం లేకుండా పడిఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పరారీలో ఉన్న నిందితుడు మద్దిలేటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.