Online Fraud: మొబైల్‌కు వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త..!

ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకుని సైబర్ ముఠాలు. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాము ఇలాంటి ఘటనలపై స్పెషల్ ఫోకస్ చేశారు పోలీసులు.

Online Fraud: మొబైల్‌కు వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త..!
Cybercrime Racket
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 17, 2024 | 11:33 AM

ఇటీవల కాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువయ్యారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకుని సైబర్ ముఠాలు. వైఫైలా మన చుట్టూరా ఉన్నాయి. అలాంటి వాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితులకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరచూ వింటూనే ఉన్నాము ఇలాంటి ఘటనలపై పోలీసులు ఎంత ఫోకస్ పెట్టిన రోజుకు ఐదు నుంచి పది ఫిర్యాదులు ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్నాయి. వివిధ రకాల మోసాలతో అమాయకులను వలలో వేసుకొని కొన్ని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.

ఇన్‌స్టా.. స్నాప్‌చాట్‌.. ఫేస్‌బుక్‌.. వాట్సాప్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజూ కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి.. లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు. అలాంటి బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్స్ కేసుల ఎఫ్‌ఐఆర్‌ విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు సైబర్ మోసాలపై జనాభా ఎక్కువ పైగా కేసులో ఒక్క బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో మాత్రమే నమోదు అయ్యాయి అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఫోన్ లోకి వచ్చే లింకులను నొక్కడంతో అక్కడ మొదలయ్యే మాటలు చివరకు డబ్బులు పోగొట్టే పరిస్థితులకు దారితీస్తోంది. గత కొంతకాలం నుంచి సైబర్ మాసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కూడళ్ల వద్ద, హాస్పిటల్స్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.

ఇటీవల మీరు కరెంటు బిల్లు చెల్లించలేదంటూ మీ కరెంటు మీటర్ కట్ చేస్తామని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. తాను డబ్బులు చెల్లించినట్లు చెప్పినప్పటికీ వినకుండా ఓ లింకును పంపించి అందులో చెల్లించాల్సిందిగా బురిడీ కొట్టించారు. ఆ తర్వాత లింకును ఓపెన్ చేసి డబ్బులు చెల్లించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాను మోసపోయినట్లు గ్రహించి బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చిన పార్సెల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, నకిలీ డాక్యుమెంట్ సైతం మీరు తీసుకెళ్తున్నారు అంటూ భయభ్రాంతులను గురిచేసి డబ్బులను దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.

ఈ విధంగా రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజాగుట్ట, బోరబండ, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ సిబ్బంది తోపాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇక మోసపూరితమైన ఆన్‌లైన్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టిన నష్టపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నారు. కస్టమర్ కేర్‌కు సంబంధించిన నెంబర్లను ఫోన్ లింక్స్ ను ఓపెన్ చేసి తమ అకౌంటు డీటెయిల్స్ ను అపరిచిత వ్యక్తులకు తెలియకుండా జాగ్రత్త పడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పామ్ లింక్‌లు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…