Hyderabad: హైదరాబాద్‌లో అర్థరాత్రి.. పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పైనే దాడి..

Hyderabad: హైదరాబాద్‌లో అర్థరాత్రి.. పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పైనే దాడి..

Noor Mohammed Shaik

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 17, 2024 | 5:01 PM

హైదరాబాద్‌లో పోకిరీ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. కొత్తపేటలో అర్థరాత్రి మత్తుపదార్థాలు సేవించి రోడ్లపై వీరంగం సృష్టిస్తుంటే ఇదేంటని అడిగిన ఓ వ్యక్తిని చితకబాది హంగామా చేశారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న ఈ గ్యాంగ్‌ను ఇక్కడి నుండి వెళ్లాలని చెప్పిన ఇంటి ఓనర్ జనార్ధన్ నాయుడుపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

హైదరాబాద్‌లో పోకిరీ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. కొత్తపేటలో అర్థరాత్రి మత్తుపదార్థాలు సేవించి రోడ్లపై వీరంగం సృష్టిస్తుంటే ఇదేంటని అడిగిన ఓ వ్యక్తిని చితకబాది హంగామా చేశారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందు ఉన్న ఈ గ్యాంగ్‌ను ఇక్కడి నుండి వెళ్లాలని చెప్పిన ఇంటి ఓనర్ జనార్ధన్ నాయుడుపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మమ్మల్నే వెళ్లమంటావా అంటూ ఇంటి యాజమానిపై ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరార‌య్యారు. దాడిలో ‌జనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడడంతో, అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇంటి ఓనర్‌ ‌జనార్దన్ నాయుడిపై జరిగిన దాడిని స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రతిరోజూ తాగుబోతులు కాలనీలో న్యూసెన్స్‌ చేస్తున్నారని స్థానికులు వాపోయారు. సరూర్‌నగర్‌ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ పది మంది దుండగుల్లో ఏడుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jun 17, 2024 12:07 PM