ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
గాడిద పాలకు పెరుగుతున్న డిమాండ్, అంతరించిపోతున్న గాడిదల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్' కింద భారీ సబ్సిడీ అందిస్తోంది. ప్రాజెక్టు వ్యయంలో 50% రాయితీతో గాడిదలు, గుర్రాల పెంపకం చేపట్టవచ్చు. ఔషధ, కాస్మెటిక్ గుణాలతో కూడిన గాడిద పాలు గ్రామీణ యువతకు లాభదాయక ఉపాధి మార్గం. ఈ పథకం ద్వారా అరుదైన జాతులను పరిరక్షించవచ్చు.
“గంగిగోవు పాలు గరిటెడైన చాలు.. కడివెడైననేమి ఖరము పాలు” అన్న మాట పాతబడిపోయింది. ఇప్పుడు గాడిద పాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, దేశంలో అంతరించిపోతున్న గాడిదల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కేవలం సాధారణ పాలు మాత్రమే కాకుండా, గాడిద పాలలోని ఔషధ గుణాలు మరియు చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాల వల్ల కాస్మెటిక్ రంగంలో వీటికి డిమాండ్ రెట్టింపు అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో లీటరు గాడిద పాలు వేల రూపాయలు పలుకుతుండటంతో, గ్రామీణ యువతకు ఇది ఒక లాభసాటి ఉపాధి మార్గంగా మారుతోంది. ఈ పథకం కింద గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల పెంపకం చేపట్టే వారికి ప్రాజెక్ట్ వ్యయంలో సగం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అంటే 50% సబ్సిడీ ఇస్తుంది. ప్రాజెక్టుకు ఒక కోటి రూపాయల ప్రాజెక్టు ఖర్చు అయితే, అందులో గరిష్టంగా రూ. 50 లక్షల వరకు కేంద్రం సబ్సిడీ అందిస్తుంది.రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు , సెక్షన్ 8 కంపెనీలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తోడు, మిగిలిన 50% నిధులను బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో పొందేందుకు కూడా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా కేవలం పాల ఉత్పత్తి మాత్రమే కాకుండా, అంతరించిపోతున్న దేశీ జాతులైన గుర్రాలు, గాడిదల సంరక్షణ కూడా సాధ్యమవుతుందని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ప్రాజెక్ట్ రిపోర్టులను సమర్పించి, ఈ భారీ రాయితీని వినియోగించుకోవచ్చు. దేశంలో గత పదేళ్లలో గాడిదల సంఖ్య ఆందోళనకరంగా 60 శాతం తగ్గిపోయింది. 2019 పశుగణన నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే మిగిలి ఉండటం ఈ జాతి మనుగడపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించడంతో పాటు, విశేషమైన ఔషధ గుణాలున్న గాడిద పాల ఉత్పత్తులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని రూపొందించింది. కేవలం ప్రైవేటు వ్యక్తులకే కాకుండా, ఈ జాతి సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏకంగా రూ. 10 కోట్ల వరకు భారీ నిధులను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. నిరుద్యోగులకు మరియు రైతులకు పశుసంవర్ధక రంగంలో నూతన ఉపాధి మార్గాలను చూపాలనే ఆశయంతో 2015లో ప్రారంభమైన ‘నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్’, ఇప్పుడు అరుదైన పశుజాతుల పెంపకాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మారుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు
టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !
Ustaad Bhagat Singh: ఉస్తాద్ ఊహించని సర్‌ప్రైజ్.. ఫ్యాన్స్‌కు పండగే..
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ చాట్‌జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి

