AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్!

హైదరాబాద్‌లో మ్యాట్రిమోని పేరుతో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.86 లక్షలు కాజేసిన ఘటన బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్!
Hyderabad Cyber Crime (1)
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 2:15 PM

Share

పెళ్లి పేరుతో మోసం చేసి ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.86లక్షలు కాజేసిన ఘటన హైదారాబాద్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. 2024లో భార్య మృతి చెందడంతో తిరిగి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2025 నవంబరులో ఒక మ్యాట్రిమోని యాప్‌లో తన వివరాలు నమోదు చేసుకున్నాడు.

రిజిస్ట్రేషన్ చేసిన కొద్ది రోజులకే అతనికి ‘ప్రీతి చోప్రా’ పేరుతో ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. తన ప్రొఫైల్ నచ్చిందని చెప్పి పరిచయం పెంచుకుంది. తర్వాత తానకు పెద్ద ఫైనాన్స్ వ్యాపారంతో సంబంధం ఉన్నదని, ఫారిన్ ఎక్స్చేంజ్, బిట్‌కాయిన్ తదితర పెట్టుబడుల్లో వ్యాపారం చేస్తున్నానని చెప్పింది. అతనిని నమ్మబలికేందుకు పెట్టుబడిదారులు భారీ లాభాలు పొందినట్లు స్క్రీన్‌షాట్లు పంపింది. అలాగే ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్‌ను కూడా షేర్ చేసింది.

ఆమె మాటలను నమ్మిన బాధితుడు తన పాన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చాడు. మొదటగా రూ.25 వేల పెట్టుబడి పెట్టగా రూ.21,750 లాభం వచ్చినట్లు చూపించారు. దీంతో నమ్మకం పెరిగిన బాధితుడు దశలవారీగా మొత్తం రూ.86 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే లాభాలను విత్‌డ్రా చేసుకునే సమయంలో సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, ఇతర చార్జీల పేరుతో మరిన్ని డబ్బులు కోరారు. బాధితుడు వాటిని కూడా చెల్లించినప్పటికీ డబ్బులు తిరిగి రాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us