AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు సంచలన నిర్ణయం..

డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే.. సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకుని, దానిపై మంచి లాభం పొందడం మరో ఎత్తు. అందుకే ఇప్పటికీ కోట్లాది మంది భారతీయులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల భరోసానే ఎక్కువగా నమ్ముతారు. సరిగ్గా అలాంటి ఇన్వెస్టర్లకు HDFC బ్యాంక్ ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఎంచుకున్న డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది.

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు సంచలన నిర్ణయం..
Hdfc Bank Hikes Fd Interest Rates
Krishna S
|

Updated on: Mar 07, 2026 | 2:07 PM

Share

సురక్షితమైన పెట్టుబడి, గ్యారెంటీ రిటర్న్స్ కోరుకునే పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. ఈ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ, దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ తన మిలియన్ల మంది ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించి నిరాశపరిచిన బ్యాంక్.. ఇప్పుడు తాజాగా నిర్దిష్ట కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు మార్చి 6 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా మార్పులు రూ.3 కోట్ల కంటే తక్కువ విలువైన రిటైల్ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి. HDFC బ్యాంక్ అన్ని రకాల FDలపై కాకుండా, కేవలం ఎంచుకున్న కాలపరిమితులపైనే 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం వడ్డీని పెంచింది. ముఖ్యంగా 3 సంవత్సరాల 1 రోజు నుండి 4 సంవత్సరాల 7 నెలల లోపు మెచ్యూరిటీ కలిగిన FDలపై ఈ పెంపుదల కనిపిస్తుంది. గతంలో ఈ కాలానికి సాధారణ కస్టమర్లకు 6.40 శాతం వడ్డీ లభించగా ఇప్పుడు అది 6.50 శాతానికి చేరింది.

సీనియర్ సిటిజన్లకు ఈ పెంపుదల మరింత లాభదాయకంగా మారింది. ఎప్పుడూ సాధారణ పౌరుల కంటే అదనపు వడ్డీని పొందే వీరికి.. పైన పేర్కొన్న కాలపరిమితిపై వడ్డీ రేటు 6.90 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. ఈ మార్పుతో HDFC బ్యాంక్ మొత్తం వడ్డీ రేట్ల శ్రేణి ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 2.75శాతం నుండి 6.50శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25శాతం నుండి 7శాతం వరకు అందుబాటులో ఉంది. ఇవి 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వివిధ అవధులకు వర్తిస్తాయి.

స్వల్పకాలిక పెట్టుబడుల విషయానికి వస్తే.. 7 నుండి 29 రోజుల కాలానికి సాధారణ కస్టమర్లకు 2.75శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25శాతం వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 6 నుండి 9 నెలల కాలానికి వరుసగా 5.50శాతం, 6శాతం వడ్డీ అందుతుంది. ఒక ఏడాది కాలపరిమితికి సాధారణ పౌరులకు 6.25శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. 18 నెలల నుండి 2 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టేవారికి సాధారణ కేటగిరీలో 6.45శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95శాతం వరకు రాబడి లభిస్తుంది.

స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి FDలు ఉత్తమ మార్గం. అయితే పెట్టుబడి పెట్టే ముందు కస్టమర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం, మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సరైన కాలపరిమితిని ఎంచుకోవడం ముఖ్యం. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం వల్ల మీ కష్టార్జితానికి గరిష్ట లాభాలను పొందవచ్చు.

Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ