Mobile Network: విచిత్రం.. ఒకే నెంబర్‌పై రెండు నెట్‌వర్క్‌లు..

ఒక నెంబర్ పై ఒకే సిమ్ నెట్‌వర్క్‌ పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ విచిత్రంగా ఒకే నెంబర్ పై రెండు వేరువేరు కంపెనీల సిమ్ లు పనిచేస్తున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ వాడుతుండగా నెట్‌వర్క్‌ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్‌ వర్క్‌కు మారిపోయాడు. కానీ ప్రస్తుత ఐడియా నెట్‌వర్క్‌తో పాటు బిఎస్ఎన్ఎల్..

Mobile Network: విచిత్రం.. ఒకే నెంబర్‌పై రెండు నెట్‌వర్క్‌లు..
Mobile Network
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jun 17, 2024 | 11:02 AM

ఒక నెంబర్ పై ఒకే సిమ్ నెట్‌వర్క్‌ పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ విచిత్రంగా ఒకే నెంబర్ పై రెండు వేరువేరు కంపెనీల సిమ్ లు పనిచేస్తున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ వాడుతుండగా నెట్‌వర్క్‌ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్‌ వర్క్‌కు మారిపోయాడు. కానీ ప్రస్తుత ఐడియా నెట్‌వర్క్‌తో పాటు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ కూడా ఒకే నెంబర్ పై పని చేస్తుందని అంటున్నాడు. ఒకేసారి రెండు సిమ్ లు ఒకే నెంబర్ తో పనిచేస్తుండడంతో తనకు ఆందోళన కలుగుతుందని అంటున్నాడు.

రెండు సిమ్ లు వేరే వేరే మొబైల్ లో వేసి చూడగా కాల్స్‌ కాస్తూ రావడం పోవడం జరుగుతుందని చెబుతున్నాడ. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ నుంచి మారిపోయిన కూడా ఆ సిమ్‌ నుంచి ఫోన్లో వెళ్లడం రావడం జరుగుతుందని అంటున్నాడు. ఇలా ఒకే సిమ్‌పై రెండు నెట్‌వర్క్‌ సిగ్సల్స్‌ రావడంపై ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles