Fuel Price: కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయా?

గతకొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చిన్నపాటి మార్పులు తప్ప ఎక్కడ కూడా ధరలు పెంపు జరగలేదు. అయితే రెండు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఆర్థిక శాఖ ప్రకారం, ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఇంధన పన్నులను..

Fuel Price: కర్ణాటకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయా?
Petrol
Follow us

|

Updated on: Jun 17, 2024 | 7:30 AM

గతకొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అక్కడక్కడ చిన్నపాటి మార్పులు తప్ప ఎక్కడ కూడా ధరలు పెంపు జరగలేదు. అయితే రెండు రోజుల కిందట కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఆర్థిక శాఖ ప్రకారం, ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఇంధన పన్నులను పెంచిన కొద్దిసేపటికే జూన్ 16, ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిది.

రాష్ట్రంలో తాజా ఇంధన పన్ను పెంపుతో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగింది , బెంగళూరులో రూ. 99.84 నుండి రూ. 102.84కి చేరుకుంది . అదేవిధంగా డీజిల్ ధర లీటరుకు రూ. 3.02 పెరిగింది. ధర పెంపు తర్వాత ఇప్పుడు రూ.85.93 నుండి రూ.88.95 పెరిగింది.

నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్‌పై అమ్మకపు పన్ను 25.92 శాతం నుండి 29.84 శాతానికి పెంచగా, డీజిల్‌పై పన్నును రాష్ట్ర ప్రభుత్వం 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెంచింది. అమ్మకపు పన్నులో ఈ గణనీయమైన పెరుగుదల రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రెండింటి రిటైల్ ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది.

అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఉంది. కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ఏపీ, తెలంగాణలో కూడా ధరలు పెంచుతారేమోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాని గురించి కూడా ఎటువంటి ప్రస్తావన వినిపించడం లేదు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచింది కాబట్టి తెలంగాణలో కూడా పెరిగే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని అక్కడక్కడ పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో అతి స్వల్పంగా తేడాలే ఉన్నాయి. అయితే విజయవాడలో రెండు రోజుల కిందటి ధరతో పోల్చితే పెట్రోల్ ధర రూ. 0.07, డీజిల్ ధర రూ. 0.07 పెరిగింది. హైదరాబాద్‌లో అయితే స్థిరంగానే కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

  • హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.41 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.46 వద్ద ఉంది.
  • వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.84 ఉండగా, డీజిల్ ధర రూ.95.11 ఉంది.

ఇక ఏపీలో..

  • విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.65 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.49వద్ద ఉంది.
  • ఇక ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.72 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.62 ఉంది.
  • ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.21 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.15 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.100.75 ఉండగా, డీజిల్ ధర లీటర్ రూ.92.34. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే – ఇండియా కూటమిలో భాగం అధికారంలో ఉంది.
  • కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.103.94 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.76. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఇంధన ధరలను రూ. 2 లకు పైగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. తాజాగా నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో మరొకసారి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారని వాహనదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉందని, గత కొన్ని వారాలుగా ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే దీనికి ప్రధాన కారణమని ప్రముఖ మీడియా సంస్థలు తమ రిపోర్ట్ లలో తెలిపాయి.

జూన్ 2017 నుంచి దేశంలో పెట్రోల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తున్నారు. దీనిని డైనమిక్ ఇంధన ధర పద్ధతి అని అంటారు. జూన్ 2017 ముందు వరకు రెండు వారాలకు ఓసారి ఇంధన ధరలను సవరించే ఇంధన కంపెనీలు, అనంతరం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించడం ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు మన దేశంలో కూడా ఇంధన ధరలు హెచ్చుతగ్గులకు గురవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి