Gold Price: లక్షకు చేరువలో వెండి ధర.. దిగి రానంటున్న బంగారం.. తాజా రేట్ల వివరాలు
దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధర ఒక రోజు పెరిగే మరో రోజు తగ్గుతుంటుంది. భారతదేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే పండగలు, పెళ్లీళ్ల సీజన్‌లో అయితే..
దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధర ఒక రోజు పెరిగే మరో రోజు తగ్గుతుంటుంది. భారతదేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే పండగలు, పెళ్లీళ్ల సీజన్‌లో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇక జూన్ 17వ తేదీన దేశంలో బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,040
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,140.
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,690.
కోల్‌కతా:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
హైదరాబాద్:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
బెంగళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,490
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,540.
ఇక దేశంలో వెండి ధర మాత్రం పరుగులు పెడుతూనే ఉంది. నేడు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టినా ప్రస్తుత ధర రూ.90,900 వద్ద కొనసాగుతోంది.
పెద్ద నగరాల్లో బంగారం ధరలు
డిమాండ్, వడ్డీ వసూలు, ఆక్ట్రాయ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ సంఘాలు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ అంశాల కారణంగా బంగారం ధరలు నగరం నుండి నగరానికి మారవచ్చు.
భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు. ఈ కారణాల గురించి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.
డిమాండ్
ఇతర వస్తువుల మాదిరిగానే, డిమాండ్, సరఫరా బంగారం ధరపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. అదేవిధంగా, అదనపు సరఫరా, స్థిరమైన లేదా బలహీనమైన డిమాండ్ కారణంగా బంగారం ధర తగ్గవచ్చు. సాధారణంగా, పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో భారతదేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
బంగారం, వడ్డీ రేట్లు విలోమ సంబంధం కలిగి ఉంటాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, ప్రజలు ఎక్కువ వడ్డీని సంపాదించడానికి బంగారాన్ని విక్రయించడానికి ఇష్టపడతారు. అదేవిధంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. తద్వారా డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గవచ్చు. శతాబ్దాలుగా పెట్టుబడిదారుల జాబితాలో బంగారం అగ్రస్థానంలో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి ఆస్తులలో ఒకటి. అలాగే ఆర్థిక భద్రతకు ముఖ్యమైన సాధనంగా పరిగణిస్తారు భారతీయులు.