New Criminal Laws: ‘జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త క్రిమినల్ చట్టాలు.. పునరాలోచించే ప్రసక్తి లేదు’

భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. కొత్త క్రిమినల్‌ చట్టాలను కేంద్రం పునరాలోచించడం లేదని ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పష్టం చేశారు..

New Criminal Laws: 'జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త క్రిమినల్ చట్టాలు.. పునరాలోచించే ప్రసక్తి లేదు'
Union Law Minister Meghwal
Follow us

|

Updated on: Jun 17, 2024 | 11:54 AM

న్యూఢిల్లీ, జూన్‌ 17: భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య.. పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు. కొత్త క్రిమినల్‌ చట్టాలను కేంద్రం పునరాలోచించడం లేదని ఈ సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పష్టం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయని ఆయన అన్నారు.

కొత్త చట్టాలు దేశంలోని క్రిమినల్‌ న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకం అని, నేర స్వభావాన్ని బట్టి సాధారణ నేరాల్లో పోలీస్‌ కస్టడీ 15 రోజుల నుంచి 90 రోజులకు శిక్ష పెరిగిందని ఆయన వివరించారు. 33 నేరాల్లో శిక్షను పెంచారు. 83 నేరాల్లో జరిమానా మొత్తాన్ని పెంచగా.. 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశ పెట్టారన్నారు. అలాగే భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాల్ని చేర్చినట్లు ఆయన తెలిపారు. ఇందులో మొత్తం 358 సెక్షన్‌లు ఉంటాయన్నారు.

కాగా భారతీయ నాగ్రిక్ సురక్ష సంహితలో 531 విభాగాలు, 177 నిబంధనలు, 9 సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు ఉంటాయి. భారతీయ సాక్ష్యాలో మొత్తం 14 సెక్షన్లు, 170 నిబంధనలు ఉంటాయి. ఈ చట్టాలను డిసెంబర్ 2023లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ, కేంద్రం వాటి అమలును వాయిదా వేయడంతో అవి అమలులోకి రాలేదు. దేశంలోని నేర న్యాయ వ్యవస్థకు కీలకమైన ఈ 3 చట్టాలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ చట్టాలను నిలుపుదల చేయాలని కోరుతూ న్యాయ మంత్రికి లేఖ రాశారు. కేంద్ర తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలపై పలువురు న్యాయవాదులు, విద్యావేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.