AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

స్థిరమైన, సురక్షితమైన ఆదాయం కోసం చూస్తున్న వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం బెస్ట్ ఆప్షన్. భారత ప్రభుత్వం మద్దతుతో నడిచే ఈ పథకం 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై నెలవారీ వడ్డీని అందిస్తుంది. రిటైర్ అయినవారు, మహిళలు, సురక్షితమైన పెట్టుబడులు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Post Office: వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?
Post Office Monthly Income Scheme
Krishna S
|

Updated on: Dec 05, 2025 | 3:09 PM

Share

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు పొదుపు పథకాల వైపు చూస్తున్నారు. సురక్షితమైన ఆదాయాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రిటైర్‌మెంట్ అయినవారు, గృహిణులు, నెలవారీ స్థిర ఆదాయం కావాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. భారత ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ఈ పొదుపు పథకం.. పెట్టుబడిదారులకు 5 సంవత్సరాల పాటు స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ కారణంగానే అన్ని వర్గాల ప్రజలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

గరిష్ట పెట్టుబడి పరిమితి ఎంత?

ఈ పోస్ట్ ఆఫీస్ పథకం ప్రధానంగా స్థిర ఆదాయంపై దృష్టి పెడుతుంది. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఖాతా తెరవడానికి కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.9లక్షలు, జాయింట్ అకౌంట్‌లో అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడి పెట్టిన 5 సంవత్సరాల పాటు వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. వడ్డీని ప్రతి నెలా చెల్లిస్తారు. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని తీసుకోవచ్చు.

వడ్డీ లెక్క ఎలా?

ప్రస్తుత వడ్డీ రేటును 7.4శాతంగా ఉంది. ఉదాహరణకు మీరు రూ. 1,50,000 పెట్టుబడి పెడితే, మీకు నెలకు సుమారు రూ. 962.50 వడ్డీ లభిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ. 3,00,000 పెట్టుబడి పెడితే, మీరు నెలకు రూ. 1,925 పొందుతారు. సింగిల్ ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ. 9,00,000 పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు నెలకు సుమారు రూ. 5,550 నుండి రూ. 5,775 వరకు వడ్డీ లభిస్తుంది. అదే విధంగా జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు నెలకు దాదాపు రూ. 9,250 వడ్డీ లభిస్తుంది. మీ నెలవారీ ఆదాయం మీరు పెట్టుబడి పెట్టే మొత్తంపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

ఇవి కూడా చదవండి

ఖాతా తెరవడం ఎలా?

ఈ నెలవారీ ఆదాయ పథకాన్ని పోస్టాఫీసుకు వెళ్లి ఈజీగా ఓపెన్ చేయవచ్చు. మీరు దరఖాస్తు ఫామ్‌తో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను సమర్పించాలి. పోస్టాఫీసు నుండి దరఖాస్తు ఫామ్‌ను తీసుకొని పూర్తిగా పూరించాలి. స్థిరమైన, సురక్షితమైన ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..