AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Auction : 4 మ్యాచులే ఆడతా అన్నా..ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ.. ఇంతకీ ఎవరతను ?

ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక డబ్బుతో అడుగుపెడుతున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందున్నాయి. కేకేఆర్ వద్ద ఏకంగా రూ.64.30 కోట్లు ఉండగా, సీఎస్కే వద్ద రూ.43.40 కోట్లు అందుబాటులో ఉన్నాయి. కేకేఆర్ ఈసారి చాలా మంది ఆటగాళ్లను విడుదల చేయడంతో, ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాటర్ స్థానంలో ఖచ్చితంగా ఒక స్టార్ ప్లేయర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

IPL 2026 Auction : 4 మ్యాచులే ఆడతా అన్నా..ఆ  ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ.. ఇంతకీ ఎవరతను ?
Kkr 2026
Rakesh
|

Updated on: Dec 05, 2025 | 3:00 PM

Share

IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలంలో అత్యధిక డబ్బుతో అడుగుపెడుతున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముందున్నాయి. కేకేఆర్ వద్ద ఏకంగా రూ.64.30 కోట్లు ఉండగా, సీఎస్కే వద్ద రూ.43.40 కోట్లు అందుబాటులో ఉన్నాయి. కేకేఆర్ ఈసారి చాలా మంది ఆటగాళ్లను విడుదల చేయడంతో, ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాటర్ స్థానంలో ఖచ్చితంగా ఒక స్టార్ ప్లేయర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వికెట్ కీపర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ వంటి ఆటగాళ్లను కూడా కేకేఆర్ విడుదల చేసింది. ఈ వేలంలో అందుబాటులో ఉన్న స్టార్ వికెట్ కీపర్లలో జోష్ ఇంగ్లిస్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రమే ఉన్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను గత ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 11 మ్యాచ్‌లలో 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్ అతన్ని విడుదల చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఇంగ్లిస్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2026 సీజన్‌లో మొదటి 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలనని పంజాబ్ కింగ్స్‌కు చెప్పాడు. గతంలో అతనిని రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసినందున, కేవలం 4 మ్యాచుల కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం సరికాదని భావించి పంజాబ్ అతన్ని వదులుకుంది.

కేకేఆర్ మాస్టర్ ప్లాన్

పంజాబ్ కింగ్స్ వదులుకున్న ఈ కీలక ఆటగాడిని దక్కించుకోవడానికి కేకేఆర్ టీమ్ ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఇంగ్లిస్ ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లే ఆడినా, రాబోయే సీజన్లలో అతను జట్టుకు రెగ్యులర్ ఆటగాడిగా అందుబాటులో ఉంటాడు కాబట్టి, ఈ క్వాలిటీ ప్లేయర్‌ను సొంతం చేసుకోవాలని కేకేఆర్ నిర్ణయించుకుంది. ఇంగ్లిస్ లాంటి క్వాలిటీ బ్యాటర్ కోసం అన్ని జట్లు పోటీ పడే అవకాశం ఉంది. అందువల్ల, ఇతన్ని దక్కించుకోవడానికి కేకేఆర్ టీమ్ వేలంలో రూ.10 కోట్ల వరకు కేటాయించినట్లు సమాచారం. ఇంగ్లిస్ గతంలో 11 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 162.58 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ప్రస్తుతం 30 ఏళ్లున్న ఇతను రాబోయే 4 సంవత్సరాలు అద్భుతంగా రాణించగలడని భావించి, కేకేఆర్ అతన్ని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాకప్‌గా డి కాక్ లేదా గుర్బాజ్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..