AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా..? ఈ చిన్న పనితో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.. ఏం చేయాలంటే..?

బ్యాంక్ అకౌంట్ కొన్నిసార్లు ఆటోమేటిక్‌గా ఫ్రీజ్‌లో పడిపోతూ ఉంటుంది. మీ అకౌంట్ నుంచి అనుమానాస్పద లావాదేవీలు చేసిన సమయంలో ఎక్కువగా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు కొన్ని పనులు చేయడం ద్వారా తిరిగి అకౌంట్ పొందవచ్చు. దానికి గల కారణాలు చూద్దాం.

Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా..? ఈ చిన్న పనితో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.. ఏం చేయాలంటే..?
Bank Account
Venkatrao Lella
|

Updated on: Mar 03, 2026 | 1:43 PM

Share

కొన్నిసార్లు కస్టమర్ల అకౌంట్లను బ్యాంకులు ఫ్రీజ్ చేస్తూ ఉంటాయి. తమ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందని, డబ్బులు తీసుకోవడానికి కూడా రావడం లేదని చాలామంది చెప్పడం మీరు వింటూ ఉంటారు. దీని వల్ల బ్యాంక్ అకౌంట్లలోని సొమ్ము హోల్డ్‌లో పడిపోతుంది. మనం విత్ డ్రా చేసుకోవాలన్నా సాధ్య పడదు. కొన్ని కారణాల వల్ల బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. మోసపూరిత లావాదేవీలు, కేవైసీ, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు వంటి కారణాలతో బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ అకౌంట్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు జమ అయితే ఆటోమేటిక్‌గా కొన్నిసార్లు అకౌంట్ పనిచేయకుండా నిలిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అధికారులను సంప్రదించి అకౌంట్‌ తిరిగి పనిచేసేలా చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం.

కారణాన్ని తెలుసుకోండి

అకౌంట్ ఫ్రీజ్ అయిన సమయంలో ముందుగా దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోండి. బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి కారణం తెలుసుకోవచ్చు. ఇక నెట్ బ్యాంకింగ్ డీటైల్స్‌తో లాగిన్ అయ్యి రీజన్ తెలుసుకోండి. డెబిట్ బ్లాక్‌డ్, కంప్లియెన్స్ ఇష్యూ లాంటి కారణాలు కనిపిస్తాయి. అక్కడ చెక్ చేసినా మీకు క్లారిటీ రాని సమయంలో నేరుగా కస్టమర్ కేర్‌కి కాల్ చేయడం ద్వారా రీజన్ తెలుసుకోవచ్చు. పూర్తి అకౌంట్ బ్లాక్ అయిందా.. లేదా పాక్షికంగా అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీరు ఏం చేస్తే యాక్టివేట్ అవుతుందనేది కూడా కస్టమర్ కేర్ సిబ్బంది చెబుతూ ఉంటారు. మీరు వాళ్లు చెప్పినట్లు చేయడం వల్ల అకౌంట్ తిరిగి వచ్చేస్తుంది.

ఏం చేయాలి..?

కేవైసీ గడువు ముగియడం వల్ల ఫ్రీజ్ అయితే ఆధార్ రీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక పాన్ కార్డ్‌ను లింక్ చేయాలి. అడ్రస్‌ను మార్చుకోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడం వల్ల రెండు, మూడు రోజుల్లో మీ అకౌంట్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఇక మీ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో ఒకేసారి జమ కావడం వల్ల ఫ్రీజ్ అయితే ఆధారాలను బ్యాంక్‌కు సమర్పించాలి. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు, కోర్టు ఆదేశాల వల్ల ఫ్రీజ్ అయితే ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక రిలీజ్ ఆర్డర్‌ను బ్యాంక్‌కు సమర్పించాలి. బ్యాంక్ సిబ్బంది అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ అకౌంట్‌ను తిరిగి పొందటంలో ఈ విషయాలు సహాయపడతాయని చెప్పవచ్చు.  బ్యాంక్ చెప్పిన సమయానికి మించి అకౌంట్ యాక్టివేట్ కాకపోతే నోడల్ ఆఫీసర్ లేదా గ్రీవెన్స్ సెల్‌ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి

Follow Us