Train Accident: అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే అధికారులు

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం

Train Accident: అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే అధికారులు
Train Accident
Follow us

|

Updated on: Jun 17, 2024 | 11:40 AM

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ రంగపాణి స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొనడం వల్ల కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాచక చర్యలు ముమ్మరం చేసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో స్పందించారు. ఇదొక విషాద రైలు ప్రమాదం. ప్రమాదం విషయం తెలియగానే ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించి వైద్య సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బోగీ మరో బోగీ మీదుగా వచ్చి గాలిలో వేలాడుతున్నాయి. మరో బోగీ ట్రాక్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈ మూడు బోగీలు ఎక్కువగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలను రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య కారణంగా గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గూడ్స్ రైలు సిగ్నలింగ్ లేకుండా కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ప్రమాద స్థలం వద్దకు 15 అంబులెన్స్‌లు పంపించినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు., సిగ్నలింగ్ సమస్య కారణంగా గూడ్స్ రైలు అదే లైన్‌లో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

హెల్ప్‌లైన్ నంబర్‌లు

ఈ ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ట్వీట్‌ చేశారు. ‘రెస్క్యూ పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. రైల్వే, NDRF, SDRF బృందాలు కలిసి రెస్క్యూలో నిమగ్నమై ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి రైల్వే హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. క్షతగాత్రుల బంధువులు 033-23508794, 033-23833326కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.