Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌

తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం భారీన పడి చేతిలో డబ్బంతా పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తెలిసిన వాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. బెట్టింగ్‌ మాయలో పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయిన సదరు యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగు చూసింది..

Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
Online Betting
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:09 PM

రామాయంపేట, జూన్‌ 17: తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనం భారీన పడి చేతిలో డబ్బంతా పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తెలిసిన వాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. బెట్టింగ్‌ మాయలో పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయిన సదరు యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..

మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట నర్సింలు కుమారుడు దొమ్మాట భానుప్రసాద్‌ (24) అనే యువకుడు గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడుతున్నాడు. ఆన్​లైన్ బెట్టింగ్​కు అలవాటు పడిన భాను ప్రసాద్‌ రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. పైగా తెలిసిన వారి వద్ద కూడా అప్పులు చేశాడు. ఆర్ధికంగా నష్టపోయిన భాను ప్రసాద్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఐదురోజుల క్రితం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు.

గమనించిన కుటుంబీకులు వెంటనే రామాయంపేటలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానకు అతడిని తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున భాను ప్రసాద్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ఎదుటే చనిపోవడంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.