IPS Suicide: క్యాన్సర్‌తో భార్య మృతి చెందిందనీ.. తట్టుకోలేక 10 నిమిషాలకే ఐపీఎస్‌ ఆఫీసర్ సూసైడ్‌!

అస్సాం ప్రభుత్వంలో స్టేట్‌ హోమ్‌ అండ్‌ పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ పనిచేస్తున్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ శిలాదిత్య చెటియా మంగళవారం (జూన్‌ 18) ఆత్మహత్య చేసుకున్నారు. సుధీర్ఘకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన భార్య మంగళవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఇది జరిగిన 10 నిమిషాలకే శిలాదిత్య ఐసీయూ గదిలోనే భార్య మృతదేహం వద్ద సూసైడ్‌ చేసుకుని..

IPS Suicide: క్యాన్సర్‌తో భార్య మృతి చెందిందనీ.. తట్టుకోలేక 10 నిమిషాలకే ఐపీఎస్‌ ఆఫీసర్ సూసైడ్‌!
IPS Suicide
Follow us

|

Updated on: Jun 19, 2024 | 7:20 AM

గువహతి, జూన్‌ 19: అస్సాం ప్రభుత్వంలో స్టేట్‌ హోమ్‌ అండ్‌ పొలిటికల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ పనిచేస్తున్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ శిలాదిత్య చెటియా మంగళవారం (జూన్‌ 18) ఆత్మహత్య చేసుకున్నారు. సుధీర్ఘకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన భార్య మంగళవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఇది జరిగిన 10 నిమిషాలకే శిలాదిత్య ఐసీయూ గదిలోనే భార్య మృతదేహం వద్ద సూసైడ్‌ చేసుకుని తనువు చాలించారు. భార్య మరణించిన ఐసోలేటెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లోపల తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

గువాహటిలోని నెమ్‌కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తున్న భర్తకు.. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ హితేష్ బారుహ్ ఫోన్‌ చేసి చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన భార్య మృతిని తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

ఇవి కూడా చదవండి

2009-బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ శిలాదిత్య చెటియా భార్య గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో నాలుగో స్టేజ్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భార్య అనారోగ్యం కారణంగా శిలాదిత్య గత నాలుగు నెలలుగా సెలవులో ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో మంగళవారం సాయంత్రం మరణించారు. సమాచారం అందుకున్న శిలాదిత్య ఆసుపత్రికి చేరుకుని.. భార్య మృతదేహం ఉన్న గదిలో నుంచి డాక్టర్, నర్సును ఒక క్షణం బయటకు వెళ్లాలని, తాను భార్య ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నానని కోరడంతో వారంతా బయటికి వెళ్లారు. అనంతరం అకస్మాత్తుగా పెద్ద శబ్ధం వచ్చిందని, లోపలికి వెళ్లి చూడగా శిలాదిత్య రక్తం మడుగులో పడి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తన సర్వీస్‌ గన్‌తో తల వెనుక భాగంలో కాల్చుకోవడం వల్ల బ్రతికించేందుకు తాము చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు తెలిపారు. ఈ దంపతులకు సంతానం లేదు. చెటియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. శిలాదిత్య మృతి చెందిన విషయం తెలియగానే పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.