Oil Tank: ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం.!

Oil Tank: ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. బకెట్లతో ఎగబడిన జనం.!

Anil kumar poka

|

Updated on: Jun 21, 2024 | 9:33 AM

గుంటూరు జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది. కోటనెమలిపురి గ్రామం... హైవే పై వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు లారీలో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లారీలో నుండి ఆయిల్ బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే లీక్ అవుతుంది పెట్రోల్, డీజిల్ కాదని అర్ధమైంది.

గుంటూరు జిల్లా అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడింది. కోటనెమలిపురి గ్రామం… హైవే పై వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. దీంతో స్థానికులు లారీలో ఉన్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో లారీలో నుండి ఆయిల్ బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే లీక్ అవుతుంది పెట్రోల్, డీజిల్ కాదని అర్ధమైంది. లారీ ట్యాంకర్ లో ఉన్న పామాయిల్ అని తెలుసుకొని జనాలు అలర్ట్‌ అయ్యారు. ట్యాకంర్‌ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్యాంకర్‌ను తొలగించే పనిలో పడ్డారు.

ఇంతలో స్తానికులు ఇంట్లో ఉన్న బకెట్లు, బిందెలు తీసుకొని ట్యాంకర్‌ వద్దకు ఎగబడ్డారు. లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న పామాయిల్ పట్టుకునేందుకు పోటీపడ్డారు. చిన్నపాటి తోపులాట కూడా చోటుచేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్‌ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. అయితే కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకొని అందరిని పంపించేశారు. నెల్లూరు నుండి హైదరాబాద్ లోని ప్యాక్టరీకి పామాయిల్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.