Singer Alka Yagnik: సడెన్‌గా వినికిడి శక్తి కోల్పోయిన ప్రముఖ సింగర్.. అదే కారణమా.?
తాను కనిపించడం లేదని గత కొంతకాలంగా అందరూ మెసేజ్‌లు చేస్తున్నారని, వారందరి కోసం పోస్ట్ పెడుతున్నాననీ అల్కా యాగ్నిక్ అన్నారు. కొన్ని వారాల క్రితం తాను విమానం దిగి వస్తుండగా సడెన్‌గా తనకేమీ వినిపించలేదని దీంతో డాక్టర్‌ను సంప్రదిస్తే న్యూరల్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పారని రాసుకొచ్చారు. వైరల్ ఎటాక్ కారణంగా ఇలా జరిగిందన్నారు.
ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇయర్ ఫోన్స్ కారణంగా ఆమె చెవులకు వైరల్ అటాక్ అయినట్లు చెప్పారు. అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను కనిపించడం లేదని గత కొంతకాలంగా అందరూ మెసేజ్‌లు చేస్తున్నారని, వారందరి కోసం పోస్ట్ పెడుతున్నాననీ అల్కా యాగ్నిక్ అన్నారు. కొన్ని వారాల క్రితం తాను విమానం దిగి వస్తుండగా సడెన్‌గా తనకేమీ వినిపించలేదని దీంతో డాక్టర్‌ను సంప్రదిస్తే న్యూరల్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు చెప్పారని రాసుకొచ్చారు. వైరల్ ఎటాక్ కారణంగా ఇలా జరిగిందన్నారు. ఇది తన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అనీ తనకు తెలియకుండానే దీని బారినపడ్డానననీ దయచేసి తన కోసం అంతా ప్రార్థించండని వేడుకున్నారు.
తన అభిమానులకు, సహచరులకు ఒక్కటే చెబుతున్నాననీ పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినడం, ఇయర్ ఫోన్స్‌ను ఉపయోగించడంలో జాగ్రత్త వహించండని సూచించారు. తన వృత్తిపరమైన జీవితం వల్ల కలిగిన తలెత్తిన అనారోగ్య సమస్యల గురించి భవిష్యత్తులో చెబుతాననీ అందరి మద్దతు, ప్రేమతో త్వరలోనే తాను కోలుకుంటానని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో అందరి సపోర్ట్ తనకెంతో అవసరం అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు టాప్ సింగర్స్, సంగీత దర్శకులు స్పందిస్తున్నారు. ‘డియర్ అల్కాజీ.. ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. అసలు ఊహించలేదు. ధైర్యంగా ఉండండి’ అని శ్రేయా ఘోషల్ కామెంట్ పెట్టారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఏఆర్ రెహమాన్, సోనూనిగమ్, శంకర్ మహదేవన్‌లు రిప్లై పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.