Gold Price Today: మరోసారి పెరిగిన బంగారం ధర.. తులం ఎంతకు చేరిందంటే..
బంగారం ధరలో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలో ఇప్పుడు కాస్త పెరుగదల కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇంకా రూ. 72వేల మార్క్ వద్దే కొనసాగుతోంది...
బంగారం ధరలో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గతకొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలో ఇప్పుడు కాస్త పెరుగదల కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇంకా రూ. 72వేల మార్క్ వద్దే కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,560గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,600 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,410కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,450 వద్ద కొనసాగుతోంది.
* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ఊ. 73,000 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,410గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,450గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,410గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,450 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,410గా ఉండగా, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 72,450గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,410వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,450గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,600 వద్ద కొనసాగుతుండగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 97,200 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..