AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Customers :తెలుగు రాష్ట్రాల్లో జియో ప్రభంజనం.. కొత్తగా 1.56 లక్షలకుపైగా కస్టమర్లు

జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం.

Jio Customers :తెలుగు రాష్ట్రాల్లో జియో ప్రభంజనం.. కొత్తగా 1.56 లక్షలకుపైగా కస్టమర్లు
Jio
Jyothi Gadda
|

Updated on: Jun 20, 2024 | 7:05 PM

Share

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. రోజురోజుకీ సరికొత్త కస్టమర్లతో జియో దూసుకుపోతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో జియోనెట్ వర్క్ దూసుకుపోతోంది.  ట్రాయ్ విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.

ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.

ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై