Cholesterol Control Tips:చపాతీ పిండిలో ఈ విత్తనాలు కలపండి..! కొలెస్ట్రాల్‌ ఐస్‌లా కరిగిపోతుంది.. గుండెపోటు భయం లేదు..!!

అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రకాల విత్తనాలను చపాతీ పిండిలో కలుపుకుని చపాతీలా చేసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అలాంటి విత్తనాలేవో ఇక్కడ తెలుసుకుందాం..

Cholesterol Control Tips:చపాతీ పిండిలో ఈ విత్తనాలు కలపండి..! కొలెస్ట్రాల్‌ ఐస్‌లా కరిగిపోతుంది.. గుండెపోటు భయం లేదు..!!
Chapati Flour
Follow us

|

Updated on: Jun 18, 2024 | 3:15 PM

కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని కాలేయం తయారు చేసే కొవ్వు పదార్థం. ఇది కొన్ని ఆహారాల నుంచి కూడా లభిస్తుంది. మన శరీరం సరిగ్గా పని చేయడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. వైద్యపరంగా దీన్ని కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. ప్రధానంగా మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్‌గా వర్గీకరిస్తారు. వీటిలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ అనేది గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రకాల విత్తనాలను చపాతీ పిండిలో కలుపుకుని చపాతీలా చేసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అలాంటి విత్తనాలేవో ఇక్కడ తెలుసుకుందాం..

నువ్వులు:

నువ్వుల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యాసిడ్స్ హృదయ స్పందన రేటుని తగ్గిస్తాయి. ట్రై గ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి, చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ని తగ్గిస్తాయి. నువ్వులను చపాతీ పిండిలో కలిపి తింటే ఆక్సీకరణ ఒత్తిడి, మంట, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజలను పిండిలో కలిపి చపాతీ పిండిని తయారు చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, సంతృప్త కొవ్వు, ఇందులో కనిపిస్తాయి. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అవిసె గింజలు :

అవిసె గింజలను కలిపి తయారు చేసిన చపాతీ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల మూలంగా ఉంటాయి.

చియా గింజలు:

చియా గింజలు మిక్స్ చేసి మరపట్టించిన పిండితో చపాతీ పిసికి కలుపుతూ ఉండాలి. దీనితో చేసిన చపాతీ తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది ఫైబర్,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ