Viral Video: వారెవ్వా.. మీ తెలివి చల్లగుండా.. ట్రాక్టర్‌ని భలేగా వాడేస్తున్నారు బ్రో..
ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అనేకం చూశాం. కొందరు పాత టీవితో కూలర్ తయారు చేశారు. ఇంట్లోని పాత సామాగ్రితో వాషింగ్ మెసీన్ వంటివి కూడా తయారు చేశారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌లో స్విమ్మింగ్ పూల్‌గా తయారు చేశారు.
మన దేశంలో జుగాఢ్ వ్యక్తులకు కొదువ లేదు. ప్రతి పనికి మనవాళ్ల దగ్గర తప్పనిసరిగా ఓ టెక్నిక్ ఉంటుంది. జుగాఢ్‌తో మనవాళ్లు ఆ పనిని సీజీగా చేసేస్తుంటారు. మనవాళ్లు ఎలాంటి సమస్యలైనా సరే దానికి అతి తక్కువ ఖర్చులో పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే అనేకం చూశాం. కొందరు పాత టీవితో కూలర్ తయారు చేశారు. ఇంట్లోని పాత సామాగ్రితో వాషింగ్ మెసీన్ వంటివి కూడా తయారు చేశారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌లో స్విమ్మింగ్ పూల్‌గా తయారు చేశారు.
రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ యూట్యూబర్ కారులోనే మినీ స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసి చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు ఏకంగా ట్రాక్టర్ ట్రాలీని మినీ స్విమ్మింగ్ పూల్‌గా మార్చేశారు.
#Breking #Amroha भीषण गर्मी से बचने के लिए तरह-तरह के अपना रहे तरीके,
ट्रैक्टर ट्राली को बनाया स्विमिंग पूल,
हाइवे पर ट्रैक्टर ट्रॉली मे बच्चों का नहाते वीडियो वायरल,
भीषण गर्मी में पानी का आनंद ले रहे बच्चे,
गजरौला थाना क्षेत्र की बिजनौर रोड का बताया जा रहा है वीडियो pic.twitter.com/bRwTzjnOyd
— Journalist Chandra prakash (@Chandra16596690) June 16, 2024
అమ్రోహా కి చెందిన కొందరు వ్యక్తులు ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్ పూల్‌లా మార్చేశారు. నీరు లీక్ అవ్వకుండా ట్రాలీని మొత్తం ఓ మందపాటి పట్టతో కవర్ చేశారు. అందులో నీళ్లు నింపి చిన్నారులు, కొందరు యువత స్విమ్మింగ్ చేస్తూ కనిపించారు. నీటిలో మునుగుతూ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..