Dolly Chaiwala: మాల్దీవుల్లో డాలీ చాయ్‌వాలా.. క్యూ కట్టిన విదేశీ పర్యాటకులు..క్రేజ్ మామూలుగా లేదు

డాలీకి నాగ్‌పూర్‌లో టీ స్టాల్ ఉంది. ఇది అతని టీ తయారు చేసే స్టైల్‌తో బాగా ఫేమస్‌. కానీ ఇప్పుడు అతను నాగ్‌పూర్ నుండి నేరుగా మాల్దీవుల బీచ్‌లో టీ స్టాల్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ అనేక మంది విదేశీ పర్యాటకులు డాలీ టీ స్టాల్‌ వద్ద క్యూ కట్టి టీ తాగుతూ ఆనందిస్తున్నారు.

Dolly Chaiwala: మాల్దీవుల్లో డాలీ చాయ్‌వాలా.. క్యూ కట్టిన విదేశీ పర్యాటకులు..క్రేజ్ మామూలుగా లేదు
Dolly Chaiwala
Follow us

|

Updated on: Jun 17, 2024 | 9:11 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా.. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ప్రతి రోజు అతనికి సంబంధించిన కొత్త కొత్త వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ, ఒక్కోసారి విదేశాలకు వెళ్లిన వీడియోలు షేర్‌ చేస్తున్నాడు.. వాస్తవానికి డాలీకి నాగ్‌పూర్‌లో టీ స్టాల్ ఉంది. ఇది అతని టీ తయారు చేసే స్టైల్‌తో బాగా ఫేమస్‌. కానీ ఇప్పుడు అతను నాగ్‌పూర్ నుండి నేరుగా మాల్దీవుల బీచ్‌లో టీ స్టాల్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ అనేక మంది విదేశీ పర్యాటకులు డాలీ టీ స్టాల్‌ వద్ద క్యూ కట్టి టీ తాగుతూ ఆనందిస్తున్నారు.

డాలీ టీ తయారీలో తన ప్రత్యేకమైన శైలితో పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు మాల్దీవుల్లోని బీచ్‌లో అదే స్టైల్‌లో టీ తయారు చేస్తూ కనిపిస్తున్నాడు. వీడియోలో, డాలీ తన టీపాట్‌ను బీచ్‌లోనే ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అతను తనదైన స్పెషల్‌ ట్యాలెంట్‌తో టీ చేస్తున్నాడు. అతని వెనుక ప్రశాంతమైన నీలిరంగు స్పష్టమైన బీచ్ కనిపిస్తుంది.. బీచ్‌లో డాలీ చాయ్‌వాలా టీ తయారు చేయడం చూసిన విదేశీ పర్యాటకులు దాన్ని వీడియోలు తీస్తుండగా, మరికొందరు టీని ఆస్వాదిస్తున్నారు. టీ తయారు చేసిన తర్వాత, డాలీ తన చేతులతో విదేశీ పర్యాటకులకు టీ అందించి, వారితో ఫోటోలు దిగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

డాలీ ఈ కొత్త వీడియో అతని Instagram పేజీ @dolly_ki_tapri_nagpur నుండి షేర్‌ చేశాడు. దానిపై చాలా మంది వ్యాఖ్యానించారు. వారి ప్రతిచర్యలను అందించారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, “మోదీ తర్వాత, ఈ టీ అమ్మకందారుడిదే పైచేయి” అని రాశారు. ఇలా చాలా మంది డాలీ చాయ్‌వాలా కొత్త వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ