AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో దాగివున్న అనారోగ్యం..?!

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దిండు కవర్ సిల్క్‌తో చేస్తే బ్యాక్టీరియా తక్కువగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై మొటిమలు కూడా రావు. కాటన్‌ కంటే సిల్క్‌ పిల్లోకవర్లు చర్మ ఆరోగ్యానికి మంచివని అధ్యయనంలో తేలింది. ఇది సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బెడ్‌షీట్, పిల్లో కవర్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్ల పాజిటివిటీ రావడంతో పాటు గది అందం పెరుగుతుంది.

Health Tips : మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో దాగివున్న అనారోగ్యం..?!
Pillow Cover
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2024 | 7:46 PM

Share

సౌకర్యవంతమైన నిద్ర కోసం చాలా మంది తల కింద దిండును తప్పనిసరిగా వాడుతుంటారు. కొందరు ఎత్తైన దిండు వాడితే, మరి కొందరు తేలికపాటి దిండుతో నిద్రపోతారు. అయితే, క్రమం తప్పకుండా ఉపయోగించే ఈ దిండు విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన సమయంలో మీ పిల్లో కవర్‌ మార్చకపోతే బాక్టీరియా, వైరస్‌లు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి నిర్దిష్ట సమయం తరువాత దిండు కవర్ మార్చాలి.

పిల్లో కవర్ అనేది వ్యాధులకు నిలయం అని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. దిండు కవర్‌ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే, చర్మం చాలా నష్టపోవాల్సి వస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కొన్నిసార్లు చికిత్స చేయించుకున్నా ప్రయోజనం ఉండదు. ఎలాంటి మందులు పనిచేయని పరిస్థితికి దారితీస్తుంది.

ప్రతి వారం దిండు కవర్‌ను మార్చకపోతే ఏమవుతుంది?

ఇవి కూడా చదవండి

వాస్తవానికి, ప్రతిరోజూ దుమ్ము, దూళి కణాలు, నూనె, డెడ్ స్కిన్, హానికరమైన బ్యాక్టీరియా, ఇంట్లో ఉండే పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటివి దిండు కవర్‌లో చిక్కుకుపోతుంటాయి.. దీని కారణంగా ముఖంపై మొటిమలు, మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. అందువల్ల పిల్లోకవర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. లేదంటే ముఖ చర్మం పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దిండును కూడా శుభ్రం చేయాలి లేదా డ్రై క్లీన్ చేయాలి. లేదా మార్చాలి.

మీరు ప్రతి వారం మీ దిండు కవర్‌ను మార్చకపోతే, అది అలెర్జీలకు కారణం కావచ్చు. కొన్నిసార్లు ఇది సంక్రమణకు కారణం కావచ్చు. ప్రతిరోజు మీరు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తర్వాత మంచంపైనే వాలిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో అది కూడా అపరిశుభ్రంగా మారుతుంది. మీరు మీ బెడ్‌షీట్, దిండు కవర్‌ను ఎప్పటికప్పుడు మార్చకపోతే అది అసౌకర్యం కలిగిస్తుంది. ఎప్పటిప్పుడు దిండు కవర్లను మార్చడం, వాష్‌ చేయడం వల్ల మీ దిండు జీవితకాలం కూడా పెరుగుతుంది. అంతే కాకుండా బెడ్‌షీట్, పిల్లో కవర్‌ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్ల పాజిటివిటీ రావడంతో పాటు గది అందం పెరుగుతుంది. బట్టలు, బెడ్​షీట్​లు రెగ్యులర్​గా, సరిగ్గా ఉతకడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను నివారించవచ్చు. రోజూ బెట్​షీట్​లను ఉతకలేం కాబట్టి కనీసం వాటిని ప్రతి ఉదయం గాలికి ఆరబెట్టాలి.

దిండు కవర్ ఎలా తీసుకోవాలి:

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దిండు కవర్ సిల్క్‌తో చేస్తే బ్యాక్టీరియా తక్కువగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై మొటిమలు కూడా రావు. కాటన్‌ కంటే సిల్క్‌ పిల్లోకవర్లు చర్మ ఆరోగ్యానికి మంచివని అధ్యయనంలో తేలింది. ఇది సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..