AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cool Drinks: శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఎన్ని వ్యాధుల బారిన పడతారో తెలుసా..

కొందరికి వేసవిలో మాత్రమే కాదు రోజూ శీతల పానీయాలను తాగే అలవాటు ఉంటుంది. తమ ఇళ్లలోని ఫ్రిజ్‌లో శీతల పానీయాలను నిల్వ ఉంచుతారు. పెద్దలతో పాటు, పిల్లలు కూడా వీటిని తాగుతారు. అయితే కొంచెం సేపు ఉపశమనం కోసం తాగే శీతల పానీయాలు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో మీకు తెలుసా..! ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇచ్చే శీతల పానీయాలకు కొదవలేదు, మార్కెట్‌లో ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. వీటి గురించి ఆలోచించకుండా తాము తాగడమే కాదు పిల్లలకు కూడా శీతల పానీయాలు ఇస్తున్నారు.

Cool Drinks: శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఎన్ని వ్యాధుల బారిన పడతారో తెలుసా..
Cool Drinks
Surya Kala
|

Updated on: Jun 17, 2024 | 8:04 PM

Share

వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటిని తినడానికి లేదా త్రాగడానికి ఇష్టపడతారు. ఈ కారణంగా వేసవిలో ఐస్ క్రీం, షేక్, జ్యూస్ లతో పాటు శీతల పానీయాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరికి వేసవిలో మాత్రమే కాదు రోజూ శీతల పానీయాలను తాగే అలవాటు ఉంటుంది. తమ ఇళ్లలోని ఫ్రిజ్‌లో శీతల పానీయాలను నిల్వ ఉంచుతారు. పెద్దలతో పాటు, పిల్లలు కూడా వీటిని తాగుతారు. అయితే కొంచెం సేపు ఉపశమనం కోసం తాగే శీతల పానీయాలు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో మీకు తెలుసా..!

ఎండ వేడిమి నుంచి ఉపశమనం ఇచ్చే శీతల పానీయాలకు కొదవలేదు, మార్కెట్‌లో ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. వీటి గురించి ఆలోచించకుండా తాము తాగడమే కాదు పిల్లలకు కూడా శీతల పానీయాలు ఇస్తున్నారు. రోజూ శీతల పానీయాలు తాగితే అది ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా?

నిద్రలేమి: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా శీతల పానీయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎనర్జీ డ్రింక్స్‌గా ప్రదర్శిస్తారు. ఈ పానీయాలలో కెఫిన్ ఉంటుం. ప్రతిరోజూ ఈ పానీయాలను తాగుతుంటే కొద్ది రోజుల్లోనే ఈ పానీయాలకు బానిస కావచ్చు. ఇందులో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి బారిన పడవచ్చు. రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడవచ్చు. ఆలోచనలో చిరాకు, ఏదైనా పని చేయడంలో ఫోకస్ చేయడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన వ్యాధుల ప్రమాదం: రోజూ శీతల పానీయాలు తాగే అలవాటు ఉంటే వీటిల్లో భారీ మొత్తంలో చక్కెర, కార్బోనిక్ ఆమ్లం, ఇతర రసాయనాలు కలుపుతారని తెలుసుకోండి. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటే ఊబకాయాన్ని పెరుగుతుంది. దీని కారణంగా మధుమేహం, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

జీర్ణ సమస్యలు: చల్లటి పానీయం ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణ శక్తిని బలహీనపరుస్తుంది. వికారం, విరేచనాలు వంటి సమస్యల బారిన పడవచ్చు. అంతేకాదు ఎక్కువగా శీతల పానీయం తాగడం వల్ల శరీరంలోని పోషకాల శోషణకు ఆటంకం ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

రక్తపోటు సమస్య: కెఫిన్‌తో పాటు, శీతల పానీయాలలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. అయితే వివిధ బ్రాండ్లు, రుచులను బట్టి సోడియం పరిమాణం ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. ఇది అధిక రక్తపోటు సమస్యను కలిగిస్తుంది. గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..