Chanakya Niti: స్త్రీల్లోని ఈ అలవాట్లు జీవితాన్ని కష్టాలతో నింపుతాయి.. భర్తలూ జాగ్రత్త అంటున్న చాణక్య

స్త్రీలలోని కొన్ని అలవాట్లు వారి భర్త జీవితాన్ని ఇబ్బందులతో నింపుతాయి. కష్టాలు జీవితంలో ఒక భాగం. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కొన్ని అలవాట్లు ఎవరినైనా సరే ఇబ్బంది పెడతాయి. ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు. స్త్రీలు తమ దుఃఖంలో ఉన్న తమ భర్తలను ఆదుకోకపోతే.. ఆ దంపతుల జీవితాన్ని కష్టాలు చుట్టుముడతాయి.

Chanakya Niti: స్త్రీల్లోని ఈ అలవాట్లు జీవితాన్ని కష్టాలతో నింపుతాయి.. భర్తలూ జాగ్రత్త అంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2024 | 5:39 PM

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి.. సంబంధించిన ముఖ్య విషయలను వెల్లడించాడు. వాటిల్లో స్త్రీలు.. వారి రకరకాల అలవాట్లను ప్రస్తావించాడు. ఈ అలవాట్ల వలన ఇంట్లో అసమ్మతి, వైషమ్యాలు ప్రబలుతాయని పేర్కొన్నాడు. స్త్రీలలోని కొన్ని అలవాట్లు వారి భర్త జీవితాన్ని ఇబ్బందులతో నింపుతాయి. కష్టాలు జీవితంలో ఒక భాగం. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. కొన్ని అలవాట్లు ఎవరినైనా సరే ఇబ్బంది పెడతాయి. ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టించవచ్చు. స్త్రీలు తమ దుఃఖంలో ఉన్న తమ భర్తలను ఆదుకోకపోతే.. ఆ దంపతుల జీవితాన్ని కష్టాలు చుట్టుముడతాయి.

మహిళలు తరచుగా ఇతరుల గురించి పుకార్లును చెప్పే అలవాటును కలిగి ఉంటారు. ఈ అలవాటు చాలా ప్రతికూలం అని చాణక్య వెల్లడించాడు. ఇటువంటి అలవాటు ఉన్న స్త్రీ తో గడిపే సమయం కూడా భర్త జీవితంలో ప్రతికూలతను తీసుకురాగలదు. కావున వీలైనంత వరకూ పుకార్లను వ్యాపించే లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్త్రీలకు దూరం ఉండడం ప్రజలకు మేలు చేస్తుంది. అంతే కాదు స్త్రీలు పొరపాటున కూడా ఇతరులను తక్కువ చేసే విధంగా కబుర్లు చెప్పకూడదు.

మోసం చేసే గుణం ఉన్న స్త్రీలకు

ఇవి కూడా చదవండి

ఆచార్య చాణక్యుడు ప్రకారం స్త్రీలు పురుషుల కంటే మోసపూరితంగా ఉంటారు. ఈ లోపం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చెడు అలవాట్ల వల్ల భర్తకు కూడా దూరం అవుతారు. కనుక స్త్రీలు ఎప్పుడూ కుటుంబంలో మోసానికి పాల్పడకూడదు.

దురాశ మంచిది

జీవితంలో ఏ విషయంలోనైనా అత్యాశ పడటం ఒక చెడు అలవాటు. పురుషుల కంటే స్త్రీలకు అత్యాశ ఎక్కువ అని చాణక్యుడు నమ్మాడు. స్త్రీలకు డబ్బు, బంగారం, వజ్రాలు, వస్త్రాలు మొదలైన వాటిపై అత్యాశ ఎక్కువ. వీరి మనస్సు ఎప్పుడూ ఈ విషయాలతో నిండిపోయి ఉంటుంది. శక్తి మించి వీరిని కోరుకునే దురాశ స్త్రీల సొంతం. వీరి గుణం వలన ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడుతుంది. భర్తతో గొడవలు కూడా ప్రారంభమవుతాయి. ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొనాలంటే స్త్రీలు ఎప్పుడూ అత్యాశ పడకూడదు.

స్వార్థం వల్ల సమస్యలు

నేటి కాలంలో చాలామంది మహిళలకు తమ పనిని ఎలా పూర్తి చేయాలో తెలుసు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా దాని నుంచి సులభంగా బయటపడుతుంది. అయితే ఈ సామర్ద్యం కూడా కొన్ని పరిస్థితులలో లోపంగా మారుతుంది. స్త్రీల్లోని ఈ స్వార్థం వల్ల తమ ప్రమేయం లేకున్నా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఆచార్య చాణక్యుడు తన విధానాలలో చెడు సమయాల్లో భర్తకు మద్దతు ఇవ్వని సామర్ద్యం ఉన్న భార్య ఉన్న వ్యర్ధం అని చెప్పాడు. ఆనందంలో అందరూ కలిసి ఉంటారు దుఃఖంలో కూడా భర్తని ఆదరంగా చూసేది మంచి భార్య అని చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.