వేల కిలోమీటర్ల దూరం నుంచే క్యాన్సర్‌కు టెలిరోబోటిక్ సర్జరీ.. సూపర్ సక్సెస్.. దీని గురించి మీకు తెల్సా

కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య రంగంలో AI వినియోగం గణనీయంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా టెలిమెడిసిన్ ట్రెండ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఆరోగ్య రంగంలో టెలి రోబోటిక్ సర్జరీ అడుగు పెట్టింది. రోగికి వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని కూడా వైద్యుడు చికిత్స చేయగలిగే టెక్నిక్ ఇది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో చేరిన రోగికి టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స అందించారు. ఈ పేషెంట్ రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాడు. అయితే డాక్టర్ గురుగ్రామ్‌లోని సెంటర్‌లో ఉన్నాడు.

వేల కిలోమీటర్ల దూరం నుంచే క్యాన్సర్‌కు టెలిరోబోటిక్ సర్జరీ.. సూపర్ సక్సెస్.. దీని గురించి మీకు తెల్సా
Tele Robotic Surgery
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:22 PM

రోజు రోజుకీ మనుషులు కొత్త కొత్త రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అదే సముయంలో రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ఆరోగ్య రంగంలో అనేక రకాల కొత్త సాంకేతికతలు అభివృద్ధి చేస్తూ వాటిని ఉపయోగిస్తున్నారు. కొత్త కొత్త సాంకేతికతో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడమే కాదు.. అందుకు తగిన చికిత్సను కూడా విజయవంతంగా అందిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య రంగంలో AI వినియోగం గణనీయంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా టెలిమెడిసిన్ ట్రెండ్ కూడా పెరిగింది. ఇప్పుడు ఆరోగ్య రంగంలో టెలి రోబోటిక్ సర్జరీ అడుగు పెట్టింది. రోగికి వేల కిలోమీటర్ల దూరంలో కూర్చొని కూడా వైద్యుడు చికిత్స చేయగలిగే టెక్నిక్ ఇది.

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో చేరిన రోగికి టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స అందించారు. ఈ పేషెంట్ రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాడు. అయితే డాక్టర్ గురుగ్రామ్‌లోని సెంటర్‌లో ఉన్నాడు. అంత దూరం నుంచి కూడా ఓ కేన్సర్ పేషెంట్ కు ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా చేశారు. ఈ రోగి శరీరంలో క్యాన్సర్ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడు. త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నాడు

టెలి రోబోటిక్ సర్జరీ అంటే ఏమిటంటే

క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ రావల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ సాంకేతికతతో రోగి అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఆపరేషన్ చేయవచ్చు. ఇందుకోసం ఆసుపత్రిలో రోబో అవసరం. శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు, కెమెరాలు రోగి దగ్గర ఏర్పాటు చేస్తారు. రోబో సహాయంతో రోగి శరీరంలోకి కెమెరా చొప్పించబడుతుంది. అప్పుడు ఈ రోబోకు వేరే ప్రాంతంలో ఉన్న డాక్టర్ అక్కడే కూర్చొని ఆదేశాలు ఇస్తారు. అలా రోబో సహాయంతో రోగికి శస్త్రచికిత్స చేస్తారు. ఈ సర్జరీ ప్రయోజనం ఏమిటంటే శరీరంలో చాలా చిన్న కోత మాత్రమే చేస్తారు. దీంతో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. సాధారణ శస్త్రచికిత్స కంటే త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం

ఈ టెక్నాలజీతో రోగికి చికిత్స చేయాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరమని డాక్టర్ సుధీర్ తెలిపారు. కనీసం 5G వేగం అవసరం. గురుగ్రామ్ కేంద్రం నుంచి ఆపరేషన్ చేస్తారు. ఈ సమయంలో రోగితో పాటు డాక్టర్ కూడా ఉంటారు. ఈ వైద్యుడు రోబోట్‌ను పర్యవేక్షిస్తూనే ఉంటాడు.. మధ్యలో ఉన్న డాక్టర్ రోబోట్‌కి ఆదేశాలను జారీ చేస్తారు. ఈ టెలి రోబోటిక్ సర్జరీ చేసే సమయంలో డాక్టర్ కళ్లకు ముదురు అద్దాలు, డాక్టర్ చేతుల్లో సెన్సార్లతో కూడిన రిమోట్ కంట్రోల్ ఉంటుంది.

డాక్టర్ ఆపరేషన్ చేయడం కోసం సూచనలు ఇచ్చే రోబోకు ఐదు సన్నని చేతులు ఉంటాయి. వీటితో పాటు ఇమ్మర్సివ్ 3డి హెచ్‌డి హెడ్‌సెట్ ఉంది. దీని కారణంగా రోగి శరీరంలోని అవయవాలు పనితీరు వాటి లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో టెలి రోబోటిక్ సర్జరీ చాలా సులభంగా కేవలం 40 నుంచి 45 నిమిషాల్లో శస్త్రచికిత్స పూర్తవుతుంది.

ఏయే వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ శస్త్రచికిత్స చేస్తారంటే

గతంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టెలీ రోబోటిక్ సర్జరీని ఉపయోగించేవారని, ఇప్పుడు భారతదేశంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ టెక్నిక్‌తో రోగులకు చికిత్స అందిస్తున్నారని ఢిల్లీలోని సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. కిడ్నీ, ఊపిరితిత్తులు, గర్భాశయం వంటి క్యాన్సర్‌ల చికిత్సలో టెలి-రోబోటిక్ సర్జరీని విజయవంతంగా ఉపయోగించవచ్చు. దీని ఖరీదు రూ.లక్ష లోపు మాత్రమే. సర్జరీ చిన్నదైతే ఇంకా తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయవచ్చనని చెప్పారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles