Navara Rice Benefits: ఇండియన్ వయాగ్రా రైస్.. త్రేతాయుగం నాటి బియ్యంతో ఆ సమస్యలే ఉండవు..
దేశీయ వరి రకాలు, వాటి సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలు నిరంతరం చర్చనీయాంశంగా ఉన్నాయి. అలాంటి రైస్ లో ఒకటి నవరా రైస్. దీనిని ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని విశ్వాసం. దీని అసలు పేరు నివార.. ఏ రోగాన్ని అయినా నివారిస్తుంది కనుక ఈ బియ్యానికి నవరా రైస్ అనే పేరు వచ్చింది. అయితే ఈ బియ్యం ఎక్కువగా కేరళ ప్రాంతంలో పండిస్తారు కనుక దీనిని కేరళ బియ్యంగా కూడా పిలుస్తారు.
వరి పంట దేశంలో ప్రధాన పంటగా ప్రత్యేక హోదాను కలిగి ఉంది. దీని కారణం ఆ సేతు హిమాచలం అంటే.. మంచుతో కప్పబడిన కాశ్మీర్ కొండల్లోని ప్రసిద్ధ పులావ్‌ల నుంచి ఉష్ణమండల రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన దేశాల్లో అన్నం ప్రధాన ఆహారంగా ఖ్యాతిగాంచింది. వరి పంట ఆహార-పునరుద్ధరణ విప్లవంలో ప్రధాన పాత్ర పోషించింది. దేశీయ వరి రకాలు, వాటి సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలు నిరంతరం చర్చనీయాంశంగా ఉన్నాయి. అలాంటి రైస్ లో ఒకటి నవరా రైస్. దీనిని ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని విశ్వాసం.
దీని అసలు పేరు నివార.. ఏ రోగాన్ని అయినా నివారిస్తుంది కనుక ఈ బియ్యానికి నవరా రైస్ అనే పేరు వచ్చింది. అయితే ఈ బియ్యం ఎక్కువగా కేరళ ప్రాంతంలో పండిస్తారు కనుక దీనిని కేరళ బియ్యంగా కూడా పిలుస్తారు. వడ్లు నలుపు రంగులో ఉంటాయి. లోపల బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. నవరా బియ్యం అనేక ఔషధ, పోషక విలువలతో ఉన్న బహుళ ప్రయోజనాలు కలిగిన బియ్యం. నవరా బియ్యాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ బియ్యం సువాసనతో ఉంటాయి.
నవరా బియ్యం ఈజీగా జీర్ణమవుతుంది. కనుక అన్ని వయసుల వారు ఈ బియ్యంతో చేసిన ఆహారపదార్ధాలను తినవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రుమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటిస్, ఒలిగోస్పెర్మియా, హేమోరాయిడ్స్, క్షయ, గర్భిణీ స్త్రీల్లో చనుబాలు పెరగడం వంటి అనేక లక్షణాలు కలిగి ఉంది.
నవారా రైస్ ఆరోగ్య ప్రయోజనాలు:
- ఈ ఎరుపు రంగు బియ్యంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుతుంది.
- మధుమేహంతో ఇబ్బంది పడేవారు నవరా బియ్యం రోజు తినడం వలన 40 రోజులకు షుగర్ వ్యాధి కచ్చితంగా అదుపులోకి వస్తుంది.
- అంతేకాదు నవరా బియ్యం పక్షవాతం, నరాల బలహీనత, స్థూలకాయం, ఊబకాయం సహా కొన్ని రకాల వ్యాధులను కచ్చితంగా నియంత్రిస్తుంది.
- కేరళ వైద్యంలో నవరా రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎముకల వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు.నవారా అన్నాన్ని గుడ్డలో చుట్టి ఎముకలు మసాజ్ చేస్తారు.
- ఈ బియ్యంతో చేసిన అన్నం మోకాళ్ళు, మోచేతి కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.
- కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనితో చేసిన అన్నాన్ని బాడీ మసాజ్ చేయడానికి ఉపయోగిస్తారు.
- పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ బియ్యంతో చేసిన ఆహారాన్ని రోజూ తింటే కొన్ని రోజులకు పక్షవాతం తగ్గిపోతుంది.
- ఈ నవరా రైస్ ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. పిల్లలు కావాలి అనుకునే మగవారిలో లోపం ఉంటే .. ఈ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..