Viral News: యూనివర్సిటీ స్టూడెంట్స్ రహస్య సమాచారం లీక్.. అమ్మాయిల కన్యత్వ సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్.. ఎక్కడంటే

కజకిస్తాన్‌లోని ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల వైద్య పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల డేటా స్టోర్ చేస్తారు. అందులో కన్యత్వం గురించిన సమాచారం ఉంది. 17 నుండి 21 సంవత్సరాల వయస్సు గల బాలికల కన్యత్వ స్థితికి సంబంధించిన సమాచారాన్ని వైద్యులు ఎందుకు సేకరించారనేది అస్పష్టంగానే ఉంది. అయితే కనీసం 190 మంది కాలేజీ విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, వర్జినిటీ, ట్యాక్స్ కోడ్‌లు లీక్ అయ్యాయి

Viral News: యూనివర్సిటీ స్టూడెంట్స్ రహస్య సమాచారం లీక్.. అమ్మాయిల కన్యత్వ సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్.. ఎక్కడంటే
Al Farabi Kazakhstan National University
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2024 | 5:10 PM

యూనివర్సిటీ కాలేజీ విద్యార్థుల రహస్య సమాచారం లీక్ అయింది. కాలేజీ అమ్మాయిల కన్యత్వానికి సంబంధించిన సమాచారం లీక్ కావడంపై యూనివర్సిటీలో కలకలం రేగింది. దాదాపు 190 మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారం వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లను కూడా పోస్ట్ చేశారు. ఈ ఘటన కజకిస్థాన్‌లోని అల్ ఫరాబీ నేషనల్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

కజకిస్తాన్‌లోని ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల వైద్య పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల డేటా స్టోర్ చేస్తారు. అందులో కన్యత్వం గురించిన సమాచారం ఉంది. 17 నుండి 21 సంవత్సరాల వయస్సు గల బాలికల కన్యత్వ స్థితికి సంబంధించిన సమాచారాన్ని వైద్యులు ఎందుకు సేకరించారనేది అస్పష్టంగానే ఉంది. అయితే కనీసం 190 మంది కాలేజీ విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, వర్జినిటీ, ట్యాక్స్ కోడ్‌లు లీక్ అయ్యాయి. ఈ లిస్ట్ వాట్సాప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ యూనివర్సిటీలో ఉత్కంఠ నెలకొంది. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ఎంత వరకు భద్రంగా ఉందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఈ విషయంలో కజకిస్తాన్ ఉన్నత విద్యా మంత్రి సయాసత్ స్పందించారు. అంతేకాదు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా వైద్యపరమైన సమాచారం లీక్ చేయడం నేరమని ఆయన అన్నారు. కాలేజీ స్టూడెంట్స్ కు సంబధించిన వివరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన  విషయాన్ని పరిశీలించామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..