AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambani Family: అనంత్ అంబానీ రాధిక వివాహం.. అతిధుల కోసం దృష్టి లోపం ఉన్న కళాకారులతో గిఫ్ట్స్ చేయిస్తున్న ఫ్యామిలీ

మార్చి లో జరగనున్న పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ప్రముఖుల కోసం స్పెషల్ గిఫ్ట్స్ సిద్ధం చేస్తోంది. అంబానీ స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి 3 వరకు పెళ్లి జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక్కి ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నారు. పెళ్ళికి వచ్చే అతిధులకు అంబానీ కుటుంబం ప్రత్యేక బహుమతులను అందజేసి  సత్కరించనుంది.

Ambani Family: అనంత్ అంబానీ రాధిక వివాహం.. అతిధుల కోసం దృష్టి లోపం ఉన్న కళాకారులతో  గిఫ్ట్స్ చేయిస్తున్న ఫ్యామిలీ
Anant Ambani Wedding
Surya Kala
|

Updated on: Feb 16, 2024 | 2:58 PM

Share

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 2023లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లకు నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే. మార్చి లో జరగనున్న పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ప్రముఖుల కోసం స్పెషల్ గిఫ్ట్స్ సిద్ధం చేస్తోంది. అంబానీ స్వస్థలం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి 3 వరకు పెళ్లి జరగనుంది. మూడు రోజుల పాటు జరగనున్న వివాహ వేడుక్కి ప్రముఖులు వివాహానికి హాజరుకానున్నారు. పెళ్ళికి వచ్చే అతిధులకు అంబానీ కుటుంబం ప్రత్యేక బహుమతులను అందజేసి  సత్కరించనుంది.

2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో  మహాబలేశ్వర్‌కు చెందిన దృష్టి లోపం ఉన్న కళాకారులు రూపొందించిన ప్రత్యేక కొవ్వొత్తులను ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యే ప్రముఖులకు బహుమతిగా అందిస్తున్నారు. ట్విట్టర్ ఖాతా @Swadesh_Online ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

పెళ్లి జరుగుతున్న శుభ సందర్భాన్ని పురష్కరించుకుని అంబానీ కుటుంబం ‘స్వదేశ వస్తువుల’ను.. కళాకారుల ప్రతిభను కీర్తిస్తుంది. అంతేకాదు ప్రాచీన హస్తకళల అమూల్యమైన వారసత్వాన్ని కాపాడడంలో మేము సైతం అంటోంది.

ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ వివాహం అప్పట్లో దేశంలో ఎవరూ చూడని విధంగా అత్యంత ఖరీదైన వివాహంగా పేరుపొందింది. అంబానీ ఫ్యామిలీ తమ ముద్దుల కుమార్తె పెళ్లికి రూ.700 కోట్లు  ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు ముఖేష్ చిన్న తనయుడు అనంత్ అంబానీ.. రాధికల పెళ్లి ఇంతకంటే గ్రాండ్ గా జరగనుందనే వార్త సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ వివాహానికి అంబానీ కుటుంబం 1200 మందికి పైగా అతిథులను ఆహ్వానించింది. ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ స్టార్స్‌తో సహా ప్రముఖ గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది