Hyderabad: కెనడాలో హైదరాబాద్ విద్యార్ధి మృతి.. అసలేం జరిగిందంటే!
ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్ధి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. విద్యార్ధి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను విద్యార్థి కుటుంబం అభ్యర్థించింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) అనే విద్యార్ధి ఉన్నత చదువుల నిమిత్తం 2022లో కెనడా వెళ్లాడు. అక్కడ ఒంటారియాలోని కిచెనర్ సిటీలో ఉన్న వాటర్లూ..
హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్ధి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. విద్యార్ధి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను విద్యార్థి కుటుంబం అభ్యర్థించింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) అనే విద్యార్ధి ఉన్నత చదువుల నిమిత్తం 2022లో కెనడా వెళ్లాడు. అక్కడ ఒంటారియాలోని కిచెనర్ సిటీలో ఉన్న వాటర్లూ క్యాంపస్‌లో కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే గత వారం రోజులుగా అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం (ఫిబ్రవరి 16) కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అహ్మద్ మృతి చెందిన విషయాన్ని అతడి స్నేహితుడు హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. మజ్లిస్ బచావో టెహ్రెక్ (ఎంబీటీ) పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
గత వారం నుంచి అహ్మద్ జ్వరంతో బాధపడుతున్నాడని, అయితే గుండె ఆగిపోవడంతో అహ్మద్ మరణించినట్లు అతని స్నేహితుడి నుంచి అతని కుటుంబానికి కాల్ వచ్చిందని ఆయన పోస్టులో తెలిపారు. ఈ వార్త విన్న అహ్మద్ తల్లిదండ్రులు, మొత్తం కుటుంబ సభ్యుటు షాక్‌కు గురయ్యారు. అతని మృత దేహాన్ని వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్‌కు పంపమని TorontoCGIని దయచేసి అడగండి అంటూ పోస్టులో తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి జైశంకర్‌ను అభ్యర్ధిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు రాసిన లేఖను కూడా ఆయన తన పోస్టులో జత చేశాడు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.
.@DrSJaishankar Sir, One Shaik Muzammil Ahmed-25 years from Hyderabad, Telangana State persuing Masters in IT from Conestoga College, Waterloo Campus in Kitchener City in Ontario, Canada since Dec 2022 was suffering from fever since last one week, but his family received a call… pic.twitter.com/hvA1munXaX
— Amjed Ullah Khan MBT (@amjedmbt) February 15, 2024
కాగా హైదరాబాద్ లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో చికాగోలో భారతీయ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై ఇటీవల దుంగడులు దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో, రక్తం కారుతున్నట్లు ఉన్న వీడియోలు అలీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మేరకు తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వివరించాడు. దీనిపై స్పందించిన చికాగోలోని భారత కాన్సులేట్ అతడికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.