AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Euthanasia: చేతిలో చేయి వేసుకుని ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ.. కారుణ్య మరణం పొందిన డచ్‌ మాజీ ప్రధాని దంపతులు

నెదర్లాండ్స్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ అగ్డ్‌ (93) ఆయన భార్య యూజినీ (93) కారణ్య మరణాన్ని ఆశ్రయించారు. వృద్ధాప్య సమస్యలతోపాటు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్యం కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దంపతు ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని తమ స్వస్థలం అయిన నిజ్మెగన్‌లో తనువు చాలించారు. ఈ మేరకు వారు ఫిబ్రవరి 5న ప్రాణాలు విడిచినట్లు డ్రైస్‌ స్థాపించిన మానవ హక్కుల..

Euthanasia: చేతిలో చేయి వేసుకుని ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ.. కారుణ్య మరణం పొందిన డచ్‌ మాజీ ప్రధాని దంపతులు
Former Dutch Prime Minister Euthanasia
Srilakshmi C
|

Updated on: Feb 15, 2024 | 3:10 PM

Share

డచ్, ఫిబ్రవరి 15: నెదర్లాండ్స్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ అగ్డ్‌ (93) ఆయన భార్య యూజినీ (93) కారణ్య మరణాన్ని ఆశ్రయించారు. వృద్ధాప్య సమస్యలతోపాటు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్యం కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దంపతు ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని తమ స్వస్థలం అయిన నిజ్మెగన్‌లో తనువు చాలించారు. ఈ మేరకు వారు ఫిబ్రవరి 5న ప్రాణాలు విడిచినట్లు డ్రైస్‌ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ‘ది రైట్స్‌ ఫోరమ్‌’ మీడియాకు వెల్లడించింది. 1977 నుంచి 1982 వరకు డ్రైస్ వాన్ అగ్ట్ నెదర్లాండ్స్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ పార్టీ తరపున తొలి ప్రధానిగా వచ్చిన ఆయన విశేష సేవలు అందించారు. 2009లో పాలస్తీనియన్ల హక్కుల కోసం ‘ది రైట్స్ ఫోరమ్‌’ అనే సంస్థను స్థాపించారు. ప్రధానిగా అతని పదవి అనంతరం కూడా నెదర్లాండ్స్‌ రాజకీయాల్లో నిబద్ధతతో కొనసాగారు.

ఇక డ్రైస్‌ వాన్‌ 2019లో బ్రెయిన్‌ హేమరేజ్‌ బారినపడ్డారు. సుదీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నా.. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు. ఆయన భార్య యూజినీ కూడా అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఈ జంట కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు. 70 ఏళ్లకుపైగా సాగిన వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రాణాలు వదిలారు. డ్రైస్‌ వాన్‌, ఆయన భార్య ఇద్దరి వయసు 93 యేళ్లే. వాన్ అగ్ట్, అతని భార్య అంత్యక్రియలు ప్రైవేట్‌గా జరిగాయి.

కాగా నెదర్లాండ్‌లో కారుణ్య మరణం 2002లో చట్టబద్ధమైంది. ఆ దేశంలో 6 షరతులతో దీన్ని అమలు చేస్తున్నారు. కారుణ్య మరణం కోరుకునేవారు భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల వంటి వాటి నుంచి ఉపశమనం పొందలేకపోవడం.. వంటివి ఆ కారణాల్లో ఉన్నాయి. బలమైన కారణం చూపి అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా లోకం నుంచి నిష్ర్కమిస్తారు. ఆ దేశంలో కారుణ్య మరణం చట్టమైన తర్వాత ఈ విధమైన మరణాల సంఖ్య పెరిగినట్లు ఓ అధికారి వెల్లడించారు. 2021లో 16 జంటలు దీని ద్వారా ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఏకంగా 29 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.