AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cotton Candy Banned: పీచు మిఠాయిపై నిషేధం.. షాపులన్నీ సీజ్‌ చేయాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశం!

పీచు మిఠాయిని ఇంగ్లిష్‌లో కాటన్ క్యాండీ అని పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టంగా తింటారు. అయితే కాటన్ క్యాండీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని తాజా అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసలింతకీ పీచు మిఠాయి తింటే కలిగే అనర్ధాలు ఏమిటీ? ఓ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏకంగా బ్యాన్‌ చేసిందంటే..

Cotton Candy Banned: పీచు మిఠాయిపై నిషేధం.. షాపులన్నీ సీజ్‌ చేయాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశం!
Cotton Candy Banned
Srilakshmi C
|

Updated on: Feb 14, 2024 | 4:25 PM

Share

పుదుచ్చేరి, ఫిబ్రవరి 14: పీచు మిఠాయిని ఇంగ్లిష్‌లో కాటన్ క్యాండీ అని పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టంగా తింటారు. అయితే కాటన్ క్యాండీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని తాజా అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చింది. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసలింతకీ పీచు మిఠాయి తింటే కలిగే అనర్ధాలు ఏమిటీ? ఓ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏకంగా బ్యాన్‌ చేసిందంటే అసలేం జరిగి ఉంటుంది? ఆ విషయాలు మీ కోసం..

కాటన్ క్యాండీని వివిధ ప్రాంతాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. దీనికి ఫెయిరీ ఫ్లాస్’, ‘బుద్ధి కే బాల్’ అనే పేర్లు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని పీచు మిఠాయి అంటారు. కాటన్ క్యాండీ అనేది ఒకరకమైన చక్కెరతో తయారు చేస్తారు. ఇది షుగర్ సిరప్ నుండి తయారవుతుంది. మిషన్‌లో ఒక చిన్న రంధ్రం ద్వారా పోగులు పోగులుగా బయటకు వస్తుంది. వీటిని ఒక కర్రపై సేకరించి వివిధ ఆకృతుల్లో కాటన్ క్యాండీ అందిస్తారు. వివిధ రంగులలో తయారు చేసే ఈ పీచు మిఠాయి దూది పింజలా, రుచికి తియ్యగా ఉంటుంది.

అయితే కొందరు వ్యాపారులు లాభాలకు ఆశపడి కాటన్‌ క్యాండీని అత్యంత విషపూరిత రసాయనాలతో తయారు చేస్తున్నారు. పుదుచ్చేరిలో అనేక దుకాణాలు ‘రోడమైన్ బి’ అనే విషపూరితమైన రసాయనాలతో ఈ మిఠాయిని తయారు చేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో రోడమైన్-బి అనే విష పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీటిని విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలని పుదుచ్చేరి అధికారులను ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఈ క్రమంలో కొన్ని షాపులకు సీల్‌ వేశారు. కాటన్‌ క్యాండీ నమూనాల్లో విషపూరితమైన పదార్థాలు కనిపించిన షాపులన్నింటినీ సీజ్ చేయాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

‘రోడమైన్ బి’ ఆహారంలో కలిపితే ఏం జరుగుతుంది?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH.gov) ప్రకారం.. Rhodamine B (RhB) అనేది రసాయన సమ్మేళనం. దీనిని వివిధ రంగుల్లో వినియోగిస్తారు. దీనిని ఆహారం ద్వారా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాలేయం కూడా దెబ్బతింటుంది. దీని అధిక వినియోగం విషంతో సమానం. అలాగే అధిక చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. ఇది హైపర్యాక్టివిటీకి దారి తీస్తుంది. ఇది పిల్లలలో మూడ్ స్వింగ్‌లకు దారి తీస్తుంది. అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా దీనిలోని తీపి దంతాల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. దీనిలో ఉపయోగించే కృత్రిమ రంగులు పిల్లలలో అలెర్జీలకు కారణమవుతాయి. చర్మంపై దద్దుర్లు, జీర్ణశయాంతర, శ్వాస సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.