AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota: కోటాలో మరో విద్యార్ధి సూసైడ్‌.. ‘జేఈఈ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయనీ..’

రాజస్థాన్‌ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా అక్కడ మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది నాలుగో మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

Kota: కోటాలో మరో విద్యార్ధి సూసైడ్‌.. 'జేఈఈ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయనీ..'
Student Suicide
Srilakshmi C
|

Updated on: Feb 13, 2024 | 5:35 PM

Share

కోటా, ఫిబ్రవరి 13: రాజస్థాన్‌ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా అక్కడ మరో విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది నాలుగో మరణం కావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఝార్ఖండ్‌కు చెందిన శుభ్‌ చౌధరీ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు పొందేందుకు ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జేఈఈ మెయిన్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో తన అంచనాకు తగ్గట్టుగా మార్కులు సాధించలేకపోవడంతో నిరాశకు లోనయ్యాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత శుభ్‌ తన గదికి తిరిగి వచ్చేశాడు. ఈ రోజు ఉదయం సీలింగ్‌కు ఉరేసుకొని వేలాడుతున్న అతడి మృతదేహాన్ని హాస్టల్‌ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శుభ్‌ కుటుంబానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తివివరాలు వెల్లడిస్తామని తెలిపారు. విద్యార్ధి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం కాలేదు. శుభ్‌ కుటుంబీకులు కోటకు చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు.

మరో ఘటన..

ఆదివారం నుంచి కోట సమీపంలో ఓ విద్యార్థి కనిపించకుండా పోయాడు. విద్యార్ధి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోటా సమీపంలోని చంబల్ నదిలో వెతకడానికి రాష్ట్ర విపత్తు దళం మోటార్ బోట్లతో వెతకడం ప్రారంభించారు. కాగా ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో వివిధ పోటీపరీక్షల కోసం యేటా వేల మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ముఖ్యంగా జేఈఈ, నీట్‌ వంటి పోలీపరీక్షలకు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. చదువు ఒత్తిడి కారణంగా అక్కడి విద్యార్ధులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్ధుల ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడటం లేదు. గత యేడాది కోటాలో 26 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.