AP DSC 2024 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలివే
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీకి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేశారు. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి బొత్స, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ సురేష్ కుమార్, విద్యా శాఖ ఉన్నతాధికారులు..
అమరావతి, ఫిబ్రవరి 12: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల భర్తీకి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం (ఫిబ్రవరి 12) విడుదల చేశారు. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 వరకు ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి బొత్స, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ సురేష్ కుమార్, విద్యా శాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ వెబ్‌సైట్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ..
‘వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా, మేనేజ్ మెంట్ల వారీగా ఖాళీల వివరాలు అందుబాటులో ఉంచారు. నేటి నుంచి 21 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపుకి అవకాశం కల్పించాం. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 22 వరకు అవకాశం కల్పించారు.మార్చ్ 5 నుంచి హాల్చటిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చ్ 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. రోజుకు రెండు సెషన్స్ గా పరీక్షలు ఉంటాయి. ముఖ్యమైన పండగలు, ఏపీపీఎస్సీ పరీక్షలు ఉన్న రోజుల్లో పరీక్షలు ఉండవు. విద్యా శాఖ కమీషనరేట్‌లో ఒక హెల్ప్ డెస్క్ ప్రారంభించాం. ఏప్రిల్ 7 న డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 122 కేంద్రాలలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హెల్ప్ డెస్క్ నంబర్- 95005619127, 9705655349 కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైన సందేహాలు ఉంటే ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సందేహాలు నివృతి చేసుకోవచ్చన్నారు. ఈ రోజు లాంచ్ చేసిన డీఎస్సీ వెబ్‌సైట్ లో అన్ని వివరాలు ఉంటాయన్నారు.
ఇంకా మంత్రి బొత్స ఈ విధంగా మాట్లాడారు.. డీఎస్సీ వెబ్‌సైట్ లాంచ్ చేశాం. రెండు జీఓలు విడుదల చేస్తున్నాం. జీఓ 11, జీఓ నంబర్ 12 ని విడుదల చేస్తున్నాం. జీఓ నంబర్ 11 అనేది డీఎస్సీ -24 రిక్రూట్ మెంట్ కి సంవంధించినది. పాఠశాల విద్యా కమీషనర్ ఆద్వర్యంలో డీఎస్సీ-24 నిర్వహిస్తున్నాం. 2018 డీఎస్సీ నాటి నిబంధనలే ఈ డీఎస్సీకి వర్తిస్తాయి. కంప్యూటర్ ఆధారంగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తాం. టెట్ కి 20% వెయిటేజ్, 80% శాతం డీఎస్సీ మార్కులకి వెయిటేజ్ ఉంటుంది. అభ్యర్ధులకి గరిష్ణ వయస్సు 44 సంవత్సరాలు, రిజర్వ్ కేటగిరి అభ్యర్దులకి అదనంగా మరో అయిదేళ్లు సడలింపు ఉంటుంది. ఈ రోజు నుంచి దరఖాస్తు స్వీకరణ ఉంటుందని వివరించారు. cse.apgov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంచామని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.