Dr.BRAOU Admission 2024-25: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దూరవిద్యా విధానంలో పలు యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు..
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దూరవిద్యా విధానంలో పలు యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 అధ్యయన కేంద్రాల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 29, 2024వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. యూజీ ప్రోగ్రామ్‌లకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌లకు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా/ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు ఏడాది వ్యవధిలో పూర్తి చేయవల్సి ఉంటుంది. ఇక సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు అయితే ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలి. సంబంధిత కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కోర్సుల వివరాలు..
యూజీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు
పీజీ ప్రోగ్రామ్..
- జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ స్పెషలైజేషన్లలో ఎంఏ డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చు. మ్యాథ్స్/ అప్లైడ్ మ్యాథ్స్/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ.. స్పెషలైజేషన్లలో ఎంఎస్సీ డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చు.
- ఎంకాం
- ఎంఎల్‌ఐఎస్సీ
- బీఎల్‌ఐఎస్సీ
- సైకలాజికల్ కౌన్సెలింగ్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్.. వంటి డిప్లొమా ప్రోగ్రాములు కూడా అందిస్తోంది.
- మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందిస్తోంది.
- ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్/ ఎన్‌జీవోస్ మేనేజ్‌మెంట్/ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు అందిస్తోంది.
ముఖ్య తేదీల వివరాలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఫిబ్రవరి 29, 2024.
- రూ.200 అపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2024.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.