Bigg Boss Season 10: బిగ్‌బాస్‌ ఫైనలిస్టును సన్మానించిన ఎస్‌ఐపై బదిలీ వేటు..! రాత్రికి రాత్రే ఉత్తర్వులు

బిగ్‌బాస్‌ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఈ షో టెలికాస్ట్‌ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్‌ టాక్‌ అందుకుంది. ఇక కన్నడ ఛానెల్‌లో ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 10 విజేతలను ఇటీవల ప్రకటించింది. మొదటి రెండు స్థానాల్లో కార్తీక్ గౌడ, డ్రోన్ ప్రతాప్ నిలిచాడు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 10 గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన కార్తీక్ గౌడకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, మారుతీ బెంజ్‌ కారు లభించింది. వర్తూర్‌ సంతోష్‌, వినయ్‌ గౌడ ఎలిమినేట్‌..

Bigg Boss Season 10: బిగ్‌బాస్‌ ఫైనలిస్టును సన్మానించిన ఎస్‌ఐపై బదిలీ వేటు..! రాత్రికి రాత్రే ఉత్తర్వులు
Bigg Boss Vartur Santosh
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2024 | 5:26 PM

బిగ్‌బాస్‌ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఈ షో టెలికాస్ట్‌ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్‌ టాక్‌ అందుకుంది. ఇక కన్నడ ఛానెల్‌లో ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 10 విజేతలను ఇటీవల ప్రకటించింది. మొదటి రెండు స్థానాల్లో కార్తీక్ గౌడ, డ్రోన్ ప్రతాప్ నిలిచాడు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 10 గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన కార్తీక్ గౌడకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ, మారుతీ బెంజ్‌ కారు లభించింది. వర్తూర్‌ సంతోష్‌, వినయ్‌ గౌడ ఎలిమినేట్‌ అవడంతో హౌస్‌లో కార్తీక్, సంగీత, ప్రతాప్ మాత్రమే మిగిలిపోయారు. వీరిలో విన్నర్‌గా కార్తీక్ గౌడ నిలవగా.. రన్నర్‌గా డ్రోన్ ప్రతాప్ రెండో స్థానంలో నిలిచాడు.

అయితే హౌస్‌లో ఫైనాన్స్ లిస్ట్ కంటెస్టెంట్‌ లిస్టులో వర్తూర్‌ సంతోష్‌ చేరుకోవడంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ వర్తూర్‌ సంతోష్‌ను సత్కరించాడు. ఇదే అతని పాలిట శాపంగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఎస్‌ఐపై బదిలీ వేటు వేశారు. బిగ్ బాస్ ఫైనలిస్ట్ వర్తూరు సంతోష్‌ను పీఎస్‌ఐ తిమ్మరాయప్ప ఘనంగా సత్కరించారు. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పీఎస్‌ఐ తిమ్మరాయప్పను రాత్రికి రాత్రే బదిలీ చేస్తూ బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోలో పులి గోరు లాకెట్ ధరించి వర్తుర్ సంతోష్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలై బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడు. బిగ్ బాస్ పోటీలో తనదైన రీతిలో ఆడిన వర్తూరు సంతోష్‌కు కోట్లాది మంది అభిమానులు చేరువయ్యారు. అయితే ఓ సారి జైలు కెళ్లిన వ్యక్తికి యూనీఫాం ధరించి డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారులు సత్కరించడం తీవ్రంగా పరిగణించారు. అదీ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవడంతో ఎస్‌ఐ చర్యని తప్పుబట్టారు. దీంతో వర్తూరు సంతోష్‌ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే అతడిని సన్మానించిన పీఎస్ఐ పోలీస్ శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

ఇవి కూడా చదవండి

పోలీసు యూనిఫాంలో పులి పంజా లాకెట్టు వేసిన కేసులో నిందితుడిగా ఉన్న వర్తూరు సంతోష్‌ను సన్మానించినందుకు గాను వర్తూరు పోలీస్ స్టేషన్ నుంచి ఆడుగోడి స్టేషన్‌కు పీఎస్‌ఐ తిమ్మరాయప్పను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందరూ వినోదానికి బానిసలే. వృత్తితో సంబంధం లేకుండా టీవీలో ప్రసారమయ్యే సినిమాలు, పాటలు, సీరియల్స్ వంటి వినోద కార్యక్రమాలను చూడటంపై ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే ప్రొఫెషనల్‌ లైఫ్‌లో మాత్రం ఎంటర్‌టైనర్‌లను అనుకరించడం, వారిపై అభిమానం చూపించడం కుదరదని తాజా చర్యతో రుజువైంది.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.