APPSC Notifications 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో ఆరు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం (ఫిబ్రవరి 9) మరో ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 కింద 18 పోస్టులు, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో 7 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో 4 లైబ్రేరియన్‌ పోస్టులు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో 1 అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌..

APPSC Notifications 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో ఆరు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
APPSC Notifications 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 10, 2024 | 5:22 PM

అమరావతి, ఫిబ్రవరి 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం (ఫిబ్రవరి 9) మరో ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 కింద 18 పోస్టులు, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో 7 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో 4 లైబ్రేరియన్‌ పోస్టులు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో 1 అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు, వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌, సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు 2, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ పోస్టు 1.. ఈ పోస్టుల భర్తీకి ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 8 వరకు కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రెవెన్యూ డివిజన్లలోనూ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్‌ స్ట్రెంత్‌ కింద 19 పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలన్నింటిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల ఫలితాల విడుదల

ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామక నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక చేసిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఏపీపీఎస్సీ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రకటించింది. కాగా రాష్ట్ర ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల భర్తీకి 2022 సెప్టెంబరులో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించి తాజాగా విడుదలైన ఎంపిక జాబితాను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.