AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crying Benefits: కన్నీరూ మంచిదే.. వెల కట్టలేని కన్నీటి బిందువులు మనసుకే కాదు కళ్లకూ చికిత్స చేస్తుంది! ఎలాగంటే

రెండు కళ్ల కన్నీటి బిందువుల విలువకు ఈ ప్రపంచంలో ఏదీ సరితూగదు. కన్నీటికి భాష లేదు గానీ భావం ఉంటుంది. అందుకే గుండెకు గాయమైతే బాధ కళ్లలో నుంచి బయటకు వస్తుంది. భాషలేకపోయినా ప్రతి కన్నీటి బిందువు మాట్లాడుతుంది. అందుకే ఎవరినీ కష్టపెట్టకండి.. ఎవరినీ కన్నీరు పెట్టించకండీ అని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కన్నీరు కార్చి ఉంటారు. లేదంటే ఆనందంతో అయినా కళ్లు చెమ్మగిల్లిన అనుభవాలు ఉంటాయి. ఇతరుల కష్టం విని చలించిన మనసు కంట తడి..

Srilakshmi C
|

Updated on: Feb 09, 2024 | 8:26 PM

Share
రెండు కళ్ల కన్నీటి బిందువుల విలువకు ఈ ప్రపంచంలో ఏదీ సరితూగదు. కన్నీటికి భాష లేదు గానీ భావం ఉంటుంది. అందుకే గుండెకు గాయమైతే బాధ కళ్లలో నుంచి బయటకు వస్తుంది. భాషలేకపోయినా ప్రతి కన్నీటి బిందువు మాట్లాడుతుంది. అందుకే ఎవరినీ కష్టపెట్టకండి.. ఎవరినీ కన్నీరు పెట్టించకండీ అని పెద్దలు చెబుతుంటారు.

1 / 5
అయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కన్నీరు కార్చి ఉంటారు. లేదంటే ఆనందంతో అయినా కళ్లు చెమ్మగిల్లిన అనుభవాలు ఉంటాయి. ఇతరుల కష్టం విని చలించిన మనసు కంట తడి పెట్టుకున్న సందర్బాలు ఉంటాయి. కొంత మంది మానసిక వేదన తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తుంటారు. చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేసినా కన్నీళ్లు ఆపుకోలేరు.

2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సహజంగా వచ్చే ఏడుపు ఒత్తిడి లేదా బాధను తగ్గిస్తుంది. వచ్చే ఏడుపును ఎప్పుడూ అణచివేయకూడదు. అలా కాకుండా ఏడుపు వస్తే వెంటనే ఏడ్చేయాలి. అప్పుడే శరీర బరువు దిగిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్ట్రెస్‌ తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
కానీ తక్కువ ఏడ్చేవారికి స్ట్రెస్‌ ప్రభావం నాడీ వ్యవస్థపై చూపుతుంది. ఏడుపు వల్ల కూడా కళ్లకు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కళ్లలో ధూళి కణాలు పడి చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కంటి నుంచి కన్నీరు విడుదలైన ప్రతిసారీ ఈ దుమ్ము, కాలుష్యం బయటికి వచ్చి, కంటిని రక్షించడం సాధ్యమవుతుంది.

4 / 5
కన్నీళ్లు కళ్లను హైడ్రేట్ గా ఉంచుతాయి. ఇది పొడి కంటి లక్షణాలను తగ్గిస్తుంది. అస్పష్టమైన దృష్టిని నివారిస్తుంది. అంతేకాకుండా కన్నీళ్లు మానసిక, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. కన్నీళ్లు కళ్లను త్వరగా శుభ్రపరచడంలో సహాయపడతాయి. కన్నీళ్లు టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడతాయి. కన్నీళ్లలో లైసోజైమ్ అనే ద్రవం ఉంటుంది. ఇది కంటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది.

5 / 5
Follow Us