AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karbonn Re-entry: భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్.. తక్కువ ధరకే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్!

Karbonn Re-entry: కార్బన్ రెబెల్ సిరీస్‌లోని బేస్, ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో సిరీస్ చిప్‌సెట్ ఉంది. బేస్ మోడల్‌లో 7000 mAh బ్యాటరీ ఉంది. ప్రో మోడల్‌లో 6000 mAh బ్యాటరీ ఉంది. బేస్ మోడల్‌లో 6.75-అంగుళాల..

Karbonn Re-entry: భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్.. తక్కువ ధరకే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్!
Karbonn
Subhash Goud
|

Updated on: Nov 02, 2026 | 9:59 PM

Share

Karbonn Re-entry: కార్బన్ రెబెల్ సిరీస్ ఫోన్లు భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ టెక్నాలజీ కంపెనీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి తిరిగి వచ్చింది. కార్బన్ రెబెల్ బేస్ మోడల్ మూడు కలర్స్‌లో విడుదల చేసింది కంపెనీ. ప్రో మోడల్ నాలుగు కలర్స్‌లో విడుదల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ అమ్మకాలు భారతదేశంలో వచ్చే వారం నుండి ప్రారంభమవుతాయి. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల నుండి కొనుగోలు చేయవచ్చు. కార్బన్ రెబెల్ సిరీస్‌లోని బేస్, ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో సిరీస్ చిప్‌సెట్ ఉంది. బేస్ మోడల్‌లో 7000 mAh బ్యాటరీ ఉంది. ప్రో మోడల్‌లో 6000 mAh బ్యాటరీ ఉంది. బేస్ మోడల్‌లో 6.75-అంగుళాల మరియు ప్రో మోడల్‌లో 6.7-అంగుళాల HD ప్లస్ రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది.

భారతదేశంలో కార్బన్ రెబెల్ సిరీస్ ఫోన్‌ల ధర ఎంత?

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని రెండు ఫోన్‌ల ధర భారత మార్కెట్‌లో రూ. 14,999గా ఉంది. కార్బన్ రెబెల్ ప్రారంభ ధర రూ. 11,999. మరోవైపు, కార్బన్ రెబెల్ ప్రో మోడల్ ధర రూ. 12,499గా ఉంది. కంపెనీ రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఫలితంగా ధర మరింత తగ్గుతుంది. కార్బన్ రెబెల్ మోడల్‌ను రూ.10,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రో మోడల్‌ను రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్‌ల అమ్మకాలు భారతదేశంలో నవంబర్ 4 నుండి ప్రారంభమవుతాయి. వీటిని అమెజాన్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల (భారత కాలమానం ప్రకారం) నుండి కొనుగోలు చేయవచ్చు. కార్బన్ రెబెల్ బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగులలో విడుదల చేసింది. ప్రో మోడల్ బ్లూ, చెర్రీ రెడ్, గోల్డ్, గ్రే రంగులలో విడుదల అయ్యింది.

ఇది కూడా చదవండి: Bank Loan: బ్యాంకులు చెప్పని రహస్యాలు.. 20 ఏళ్ల రుణం 5-7 ఏళ్లలోనే తీర్చేయండి.. 5 స్మార్ట్ EMI ట్రిక్స్

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, మజూరీ, GST కలిపి లెక్కలివే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
అంబరాన్నంటుతున్న వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ సంబరాలు
అంబరాన్నంటుతున్న వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవ సంబరాలు
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..!
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: క్యూర్​ పరిధిలో ఊరిస్తున్న అదృష్టం..!
రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ
రూ.1.50 కోట్ల చిట్టీల మోసం.. కష్టార్జితం కోల్పోయిన బాధితులకే ఐపీ