AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Santosh Bangar: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే.. ‘వారు ఓటు వేయకుంటే 2 రోజులు అన్నం తినకండి’ స్కూల్‌ విద్యార్ధులకు విజ్ఞప్తి

'మీ అమ్మానాన్నలు నాకు ఓటు వేయకుంటే మీరు రెండు రోజుల వారకు ఇంట్లో భోజనం చేయకండి' అంటూ స్కూల్‌ విద్యార్ధులను శివసేన ఎమ్మెల్యే కోరడం వివాదాస్పదంగా మారింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన శాసనసభ్యుడు, కలమ్నూరి సంతోష్ బంగర్ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ముందు నుంచే క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను..

MLA Santosh Bangar: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే.. 'వారు ఓటు వేయకుంటే 2 రోజులు అన్నం తినకండి' స్కూల్‌ విద్యార్ధులకు విజ్ఞప్తి
MLA Santosh Bangar
Srilakshmi C
|

Updated on: Feb 11, 2024 | 4:09 PM

Share

ముంబై, ఫిబ్రవరి 11: ‘మీ అమ్మానాన్నలు నాకు ఓటు వేయకుంటే మీరు రెండు రోజుల వారకు ఇంట్లో భోజనం చేయకండి’ అంటూ స్కూల్‌ విద్యార్ధులను శివసేన ఎమ్మెల్యే కోరడం వివాదాస్పదంగా మారింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన శాసనసభ్యుడు, కలమ్నూరి సంతోష్ బంగర్ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ముందు నుంచే క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్ధులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే రెండు రోజులు భోజనం చేయకండి’ అని విద్యార్ధులను మరాఠీలో కోరారు. భోజనం చేయమని వారి తల్లిదండ్రులు కోరితే సంతోష్‌ బంగార్‌కు ఓటేయండి.. అప్పుడే తింటాం అని చెప్పాలని చిన్నారులకు సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పిల్లలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల్లోనే శివసేన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎన్నికల విధివిధానాల ప్రకారం.. ఓట్ల కోసం పిల్లలను అస్త్రాలుగా వినియోగించకూడదు. ఈ విధమైన రాజకీయ ప్రచారం పూర్తిగా నిషేధం. దీంతో 1986 బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టంలోని కొన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లైంది. కాగా ఎమ్మెల్యే బంగార్‌ ఇలాంటి షాకింగ్‌ వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు నోరు జారి అబాసుపాలయ్యాడు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా రాకపోతే తాను ఉరి వేసుకుంటానని గత నెలలో బహిరంగంగా ప్రకటించాడు. దీంతో ఆ పార్టీ నేతలంగా తెల్లముఖాలేశారు.

ఎమ్మెల్యే బంగార్ తాజా వ్యాఖ్యలపై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ‘బంగార్ పాఠశాల పిల్లలకు చెప్పినది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అతను బీజేపీకి మిత్రపక్షం. కాబట్టి పక్షపాతం లేకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని NCP-SP అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో డిమాండ్‌ చేశాడు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.