FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్టాగ్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..!
టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్ళపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను తొలగించాలని నిర్ణయించింది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.
టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూళ్ళపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను తొలగించాలని నిర్ణయించింది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం.
తాజాగా దాని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి. లేదంటే, తగినంత ఫాస్టాగ్ యాప్‌లో క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి GPS ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా సాగుతుందని కేంద్ర భావిస్తోంది.
కేంద్రం తీసుకువచ్చిన ఫాస్టాగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ట్యాగ్స్.. వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించేందుకు వీలవుతుంది. ట్రాఫిక్ రద్దీ, టోల్ ఫ్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2016 లో వీటిని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటికీ లో-బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలు వంటి కొన్ని సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనదారుల ఇబ్బందుల పరిష్కారానికి GPS ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకు రావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.
GPS ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ.. ప్రస్తుతం దీనిని దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై విజయవంతంగా పరీక్షించారు. ప్రత్యేక సీసీ కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది సులువుగా పని చేస్తోంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీతో వర్క్ చేస్తోంది. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్‌ను తీసివేసుకుంటుంది. GPS-ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్‌ల కంటే అనేక ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది.
జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటు లోకి వస్తే, టోల్ ప్లాజాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాల్సిన, ఆపాల్సిన అవసరం రాదు. దీనివల్ల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఫాస్టాగ్స్‌ను రీఛార్జ్ చేయడం లేదా తగినంత బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగు పడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి పోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురు కావంటున్నారు నిపుణులు.
GPS ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్స్‌ను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ప్రధాన రహదారులతో ప్రారంభించి క్రమంగా అన్ని చోట్లా దీనిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఇది వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్‌లు నిరుపయోగంగా మారవు. వీటిని చిన్న రహదారులపై లేదా బ్యాకప్ ఆప్షన్ గా భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు.
2024, ఏప్రిల్ ప్రారంభంలో GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ వంటి ఏవైనా సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకు రావచ్చు. మొత్తం మీద GPS ఆధారిత టోల్ సిస్టమ్ భారత దేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు. టోల్ బూత్ లను తొలగించడం, మరింత సమర్థవంతమైన వ్యవస్థను అందిస్తూ, ఇది దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణికులు, సరకు రవాణాదారులకు ప్రయాణ సమయాన్ని, సౌకర్యాన్ని మెరుగు పరుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..