AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Delhi: ఢిల్లీ హోటల్‌ గదిలో లభ్యమైన మృతదేహాలు.. గదిలో మందుల సీసాలు, సిరంజీలు!

హోటల్‌ గదిలో గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యమైన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం తమ హోటల్‌లోని ఓ గదిని బుక్‌ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు లోపల నుంచి గది లాక్‌ చేసుకున్నారు. గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంతకూ స్పందించట్లేదని హోటల్‌ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా గదిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో..

New Delhi: ఢిల్లీ హోటల్‌ గదిలో లభ్యమైన మృతదేహాలు.. గదిలో మందుల సీసాలు, సిరంజీలు!
2 Men Found Dead At Delhi Hotel Room
Srilakshmi C
|

Updated on: Feb 11, 2024 | 5:27 PM

Share

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: హోటల్‌ గదిలో గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యమైన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం తమ హోటల్‌లోని ఓ గదిని బుక్‌ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు లోపల నుంచి గది లాక్‌ చేసుకున్నారు. గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంతకూ స్పందించట్లేదని హోటల్‌ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా గదిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించారు. ఈ షాకింగ్‌ ఘటన శనివారం (ఫిబ్రవరి 10) వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌ గదిలో ఇద్దరు వ్యక్తులు బస చేశారు. అయితే గదిలోపల ఉన్న వ్యక్తులు లోపల డోర్‌కి లాక్‌ వేసుకున్నారు. హోటల్‌ సిబ్బంది ఎన్నిసార్లు పిలిచినా స్పందించక పోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూమ్ నెంబర్‌ 304 తలుపులు పగులగొట్టి చూడగా లోపలి దృశ్యం చూసి ఒక్కాసారిగా షాక్‌కు గురయ్యారు. ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. మృతులను హర్యానాకు చెందిన జితేష్‌ ఘన్‌ఘాస్‌ (29), నాంగ్లోయ్‌కు చెందిన సచిన్‌ (24)లుగా గుర్తించారు. మృత దేహాల పక్కన కొన్ని మందుల బాటిల్స్‌, సిరంజీలు కూడా లభ్యమయ్యాయి. మాదకద్రవ్యాల అధిక వినియోగం వల్ల వీరు మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌జిఎం ఆసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరో ఘటన: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు

పెళ్లి రోజే ఆ దంపతుల జీవితాల్లో తీరని విషాదం నింపింది. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే వారు కానీ అంతలోనే మృత్యువు కబలించింది. తెలంగాణలోని భిక్కనూరుకు చెందిన జమ్మగౌని పేట స్వామి, నవ్వ(38) దంపతులు. వీరి పెళ్లి రోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం కూడెళ్లి రాజరాజేశ్వరాలయానికి బైకుపై వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భిక్కనూరు చర్చి ప్రాంతం నుంచి మండల కేంద్రంలోకి వస్తుండగా హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో నవ్య అక్కడి కక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన స్వామిగౌడ్‌ను అంబులెన్స్‌లో కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. నవ్య మరణవార్త వీరి గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.