Indian Railways: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ ఏదో తెలుసా.? ఈ స్టేషన్ నుంచి..
ఇదిలా ఉంటే దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది.? ఏ రాష్ట్రంలో ఉంది.? అక్కడి నుంచి ఏయే ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి...

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ భారతీయు రైల్వే వ్యవస్థ. దేశంలో ప్రతిరోజూ లక్షల మందిని రైల్వేలు గమ్య స్థానానికి చేరవేస్తున్నాయి. ఎక్కు దూరం ప్రయాణించడానికి దేశంలో ఎక్కువ మంది ఉపయోగించేది రైళ్లేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా దేశంలో వేలాది మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదే కావడం విశేషం, దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రానికి రైల్వే అందుబాటులో ఉంది. ఇక ఎన్నో విశేషాలకు ఇండియన్ రైల్వే పెట్టింది పేరు.
ఇదిలా ఉంటే దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏది.? ఏ రాష్ట్రంలో ఉంది.? అక్కడి నుంచి ఏయే ప్రాంతాలకు సేవలు అందుబాటులో ఉన్నాయి లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మధుర రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌లో మీరు 24 గంటలూ రైల్లు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడి నుంచి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం వైపు వెళ్లే ప్రతీ రైలు ఈ స్టేషన్ మీదుగా వెళుతుంది.
అంతేకాకుండా ఇక్కడి నుంచి జమ్మూ-కశ్మీర్, కన్యాకుమారి వరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. 1875లో మధుర జంక్షన్‌లో మొదటిసారిగా రైల్వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మధుర రైల్వే స్టేషన్ ఉత్తర మధ్య రైల్వేలో భాగం. ఈ రైల్వే స్టేషన్ నుంచి 7 మార్గాల్లో రైళ్లు నడుస్తాయి, వీటిలో దాదాపు అన్ని దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఉన్నాయి. మధుర చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, దీని గుండా రైళ్లు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రైళ్లు మధుర జంక్షన్ గుండా వెళుతాయి.
దేశంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్‌నుగా పేరు గాంచిన మధుర స్టేషన్ నుంచి ప్రతి గంటకు ఒక రైళ్లు అందుబాటులో ఉంటుంది.. ఇది చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, ప్రతి గంటకు ఒక రైలు ఒక దిశలో లేదా మరొక వైపు వెళ్లడాన్ని చూడవచ్చు. మథుర చుట్టుపక్కల నగరాల నుండి కూడా రైలు కోసం మధుర రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
